BrahmaSree MVR Sharma’s commentary on
Gita Chapter 7 - श्रीमद्भगवद्गीता विज्ञानयोगः
SANSKRIT/ENGLISH /TELUGU
01
______________________________________
मय्यासक्तमनाः पार्थ योगं युञ्जन्मदाश्रयः,
असंशयं समग्रं मां यथा ज्ञास्यसि तच्छ्रृणु ।
_____________________________________
नन्दिनी
त्वं पदलक्ष्यं ज्ञेयं प्रथमे षट्के कर्मसंन्यासप्रधाने ।
अथ
१ तत् पदार्थम्
२ भक्तभेदाः
३ अभक्तभेदाः च निरूपितानि अद्वितीये द्वितीये षट्के ।
तत्र भजनीयं स्वरूपं, भक्ताश्च ज्ञेयौ सप्तमे अध्याये।
षष्टाध्यायान्ते “मद्गतेन अन्तरात्मना यो मां भजते स मे युक्ततमो मतः” इति उक्तम्। तत्र कीदृशः त्वं ? कथं वा तद्गतो अन्तरात्मा स्यात् ?? इत्यपेक्षायां ( एतत् प्रष्टव्यं प्रश्नद्वयं अपृष्टमपि स्वयमेव विवक्षुः) आह भगवान् -
मयि - परमेश्वरे
आसक्तमनाः - आ = अत्यन्तं , सक्तमनाः = स्नेहयुक्तमनाः ।
अत एव त्वं
मदाश्रयः - मदेकशरणः
विषयान्तरितपरिहारेण निविष्टम्
योगं युञ्जन् - मनः समाधानं कुर्वन्
असंशयं - निःसंशयं यथा भवति
समग्रं - साक्षात्कारपर्यवसानम्
यथा ज्ञास्यसि - येन प्रकारेण ज्ञास्यसि
तत् श्रुणु - मया उच्यमानं तत् ज्ञानं श्रुणु ।
In brief,
O Arjuna! Hear how to know Me wholly without any doubt what so ever
with mind set on Me and being dependent on Me, performing Yoga.
मयि आसक्तमनाः with the mind set firmly in (on Me) , this Me will be described later
నన్దిని
ప్రథమషట్కమైన కర్మకాండ తరువాత, ద్వితీయషట్కమైన ఉపాసనాకాండను శ్రీకృష్ణ రూపుడైన వ్యాసుడు చెపుతున్నాడు -
శ్రీభగవానువాచ - श्रीभगवानुवाच
మయ్యాసక్తమనాః పార్థ యోగంయుంజన్మదాశ్రయః,
అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తచ్ఛృణు .
శ్రీభగవంతుడు ఇలా అంటున్నాడు
నా పై మనసు లగ్నం చేసి, నన్నే ఆశ్రయంగా చేసుకొని, యోగాభ్యాసం చేస్తూ, నా గురించి సందేహాలు పెట్టుకోకుండా, నాగురించి ఎట్లా తెలుసుకోవాలో చెపుతాను.
చర్చ కు ఉపోద్ఘాతము,
మహావాక్యాలని ప్రసిద్ది చెందినవి
1 . तत्त्वमसि తత్త్వమసి, సామవేదం, చాందోగ్యోపనిషత్తు 6.8.7
2 . अहं ब्रह्मास्मि అహం బ్రహ్మాస్మి, యజుర్వేదం, బృహదారణ్యక ఉపనిషత్తు 1.4.10
3 . प्रज्ञानं ब्रह्म ప్రజ్ఞానం బ్రహ్మ , ఋగ్వేదం, ఐతరేయ ఉపనిషత్తు 3.3
- अयं आत्मा ब्रह्म అయం ఆత్మా బ్రహ్మ, అథర్వ వేదం, మాండూక్య ఉపనిషత్తు 1.2
తత్త్వమసి ( తత్ + త్వం + అసి) అనేది వేదంలోని మహావాక్యాలలో ముఖ్యమైనది.
తత్ = ఆ పరమాత్మ
త్వం = నీవు అనబడే జీవాత్మవే
అసి = అయి వున్నావు, అనేది యీ మహావాక్యానికి అర్థం.
వేదంలోని వాక్యాలు అన్నీ గొప్పవే , ఐనప్పుడు కొన్నివాక్యాలను మాత్రమే మహావాక్యాలని ఎందుకు సంబోధించుట?
పరస్పర సంబద్ధార్థకవాక్యమని అర్థం.
అంటే, జీవబ్రహ్మైక్యాన్ని బోధించుట వల్ల వీటికి మాత్రమే మహత్త్వసంబుద్ధి.
మీమాంస - वाक्यसमुदायरूपत्वे सत्वेकवाक्यम् అంటుంది.
భగవద్గీత లోని మొదటి షట్కము, అనగా మొదటి ఆరు అధ్యాయాల సమూహము, ‘త్వం’ పదార్థాన్ని (జీవాత్మను) బోధించినది . అది ఉపాసకకాణ్డ.
ప్రకృతం ప్రారంభిస్తున్న ద్వితీయ షట్కం ‘తత్’ ( పరమాత్మ) బోధకము. దీనికి ఉపాసనాకాణ్డమని కూడా పేరు.
ఇందులో ఉండే విషయాలు మూడు -
-
తత్ పదార్థం - పరబ్రహ్మభూతమైన వాసుదేవస్వరూపము ,
-
భక్తులలోని భేదాలు,
-
దానికి ప్రతియోగియైన అభక్తుల లోని భేదాలు. ప్రతియోగి అంటే यस्याभावः सःप्रतियोगी , విరోధిత్వము. ఇంగ్లీషులో counterpart.
………… ……….. …………
ఈ ఆరు అధ్యాయములు ధ్యేయాన్ని / జ్ఞేయాన్ని వ్యాఖ్యానించబోయేవి.
గడచిన షట్కంలోని ఆరవ అధ్యాయంలో
“శ్రద్ధావాన్ భజతే యో మాం…” అన్న శ్లోకాన్ని వివరించుమని అర్జునుడు ప్రశ్నించవలసి ఉండింది. అందులోని విషయాలు
-
ఏవిధంగా భగవంతుని రూపాన్ని భజించవలెను?
-
అంతరాత్మ భగవంతుణ్ణే ఎలా పొందేది?
మొదలైనవి. ప్రశ్నలు అడుగకుండా జవాబు చెప్పుట యుక్తము కాదు नाఽपृष्टः कस्यचिद्ब्रूयात् అని సూక్తి. అయితే, శ్రీభగవన్తుడు పరమకారుణికుడు, శంకర రూపంలో భోళా శంకరుడు - కనుక తనంతట తనే, అడుగకపోయినా సరే , చెప్పుదామనే కోరికతో, स्वयमेव विवक्षुः, ఏమి చెప్పుదామనుకుంటున్నాడు ? సప్తమాధ్యాయంలో భక్తులకు భజనీయస్వరూపాన్ని నిరూపించదలచుకున్నాడు.
मयि మయి - నాయందు, ఎటువంటి తనయందు? దోషగంధంకూడా లేని భగవంతునిలో, అనన్త కల్యాణగుణాశ్రయుడైన ‘వాసుదేవుని’లో
आसक्तं ఆసక్తం - आ అత్యన్తం सक्तमनाः అతీవస్నేహయుక్తమనాః
దృఢంగా నిబద్ధమైన మనస్సు
योगं యోగం - ద్విరూపమైన ( కర్మ, జ్ఞాన) యోగాన్ని
पार्थ పార్థ - అనే సంబోధన,నా భక్తురాలయిన ( భాగవతంలోని స్తవాలలోకెల్లా కున్తీస్తవమే ప్రప్రథమము), నా మేనత్త కొడుకువు- కనుక నాచే అనుగ్రహింపదగినవానివి అని సూచన.
योगं युञ्जन्యోగం యుఞ్జన్- అభ్యసించి,మనస్సును సమాధానం చేసి ,
मदाश्रयः మదాశ్రయః- నేనే ఈశ్వరేశ్వరుణ్ణి, అన్య దేవ మనుష్యాదులు సర్వసమర్థులు కాదు ( शाकाय वा स्याल्लवणाय वा स्यात् 😀 అని జగన్నాథ పణ్డితరాయలన్నట్లుగా ) ,
మదేక శరణుడవై
असंशयंఅసంశయం-నిస్సంశయం అయ్యేట్లుగా
समग्रंసమగ్రం - శాఖాగ్రము పండు కనుక సమగ్ర మంటే ఫలయుతము!
సర్వవిభూతి,శక్తి, ఐశ్వర్య సంపన్నుడనైన నా రూపాన్ని-సఫలమయ్యేటట్లుగా ,
यथा ज्ञास्यसिయథా జ్ఞాస్యసి- సగుణంగా,నిర్గుణంగానూ ఎలా తెలుసుకోవాలో అలా, గుణం అంటే? गुणः प्रमाया असाधारणकारणम्ఇంగ్లీషులో quality,
_అర్థేన సమం అఞ్చతి సంగచ్ఛత ఇతి సమ్యక్, అర్థం ( ఫలం) తో సంగతమయేది సమ్యక్ _ ఇతిభావః…mvr
02
ज्ञानं तेहं सविज्ञानमिदं वक्ष्याम्यशेषतः,
यज्ज्ञात्वा नेहभूयोन्यज्ज्ञातव्यमवशिष्यते ।
____________________________
नन्दिनी
वक्ष्यमाणं ज्ञानं स्तौति-
ज्ञानं-शास्त्रीयम्( “सत्यं ज्ञानमनन्तं ब्रह्म " ) । ज्ञास्यसि इति वदति चेत् तत् ज्ञानं परोक्षमेव इति शङ्कां व्यावर्तयन्ज्ञानमिति प्रयोगः
इदं- मद्विषयम्
ते - तुभ्यम्
स विज्ञानं …
विज्ञानं- अनुभवः , तत्सहितं , विद्वद्भिः प्रत्यक्षेण अनुभूतम्
अशेषतः- कार्त्स्न्येन,साकल्येन, यावता वस्तु अनुभूयते तावत् , यावदर्जुनयोग्यं शिष्यमाणमकृत्वा
वक्ष्यामि- उपदेक्ष्यामि
यत्ज्ञात्वा -मयोपदिष्टं प्राप्य , यत् साक्षात् अनुभूय
इह- श्रेयोमार्गे स्थितस्य मुमुक्षोः
ज्ञातव्यं न अवशिष्यते-ज्ञातव्यान्तरनिरपेक्षम्( न तु इदं साकाङ्क्षं , इति)। “येनाश्रुतं श्रुतं भवत्यमतं मतमविज्ञातं विज्ञातम्” इति एकविज्ञानेन सर्वविज्ञानश्रुत्या ‘इहैव पुनः न विज्ञातव्यं वस्तु अवशिष्यते।
In brief,
I shall enlighten you with that knowledge together with it’s realisation,in detail.
Nothing more remains to be known once it is grasped.
జ్ఞానం తేహం సవిజ్ఞానమిదంవక్ష్యామ్యశేషతః।
యజ్జ్ఞాత్వానేహభూయోన్యజ్జ్ఞాతవ్యమవశిష్యతే॥
నన్దిని
నాకు సంబంధించిన ఆ జ్ఞానమునూ ,మరియు తత్సంబంధి అనుభవజ్ఞానమునూ చెప్పుతున్నాను;దీనిని పొందిన తర్వాత ఇంకా తెలుసుకోవలసింది ఇంకొకటి యేదీ మిగిలి ఉండదు.
इदं ज्ञानं ఇదం జ్ఞానమ్- ఈ శాస్త్రీయ అపరోక్ష జ్ఞానాన్ని
स विज्ञानं స విజ్ఞానమ్- స్వానుభవ సంయుక్తంగా
ते తే- నీకు
अहं అహం- నేను
अशेषतः అశేషతః- కృత్స్నంగా,మొత్తమూ
वक्ष्यामि వక్ష్యామి- చెపుతాను
यत् ज्ञात्वा యత్ జ్ఞాత్వా- ఏ నిత్య చైతన్య రూప జ్ఞానం కలిగిన తరువాత
भूयः భూయః- పునః,మళ్ళీ
अन्यत् ज्ञातव्यंఅన్యత్ జ్ఞాతవ్యమ్- ఇంకా తెలుసుకోవలసిన పురుషార్థ సాధనము
न अवशिष्यतेన అవశిష్యతే- మిగులదో ( నా తత్త్వజ్ఞుడు సర్వజ్ఞుడవుతాడు- అని అర్థం)
భగవంతుడు తన భజనీయస్వరూపాన్ని , జ్ఞానైకరూపాన్ని తెలుసుకునే విధాన్ని తెలుపుతానని ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు.
………. ……….. ………..
ఈ నా విషయికమైన అపరోక్షజ్ఞానాన్ని చెపుతాను,అంటున్నాడు.
అసంభావన,విపరీత భావన మొదలైన ప్రతిబంధాల వల్ల ఫలాన్ని యివ్వలేనిది- పరోక్షజ్ఞానము.
అసంభావన మొదలైన వాటిని నిరసించి,అవే ప్రమాణాలతో విచారపరిపాకం వల్ల పుట్టిన జ్ఞానం ప్రతిబంధం లేకపోతే ఫలజనకమవుతుంది- అప్పుడు దానికే అపరోక్షజ్ఞానమని పేరు.
అటువంటి శాస్త్రజన్యమైన జ్ఞానం విచారపరిపాకంతో పుట్టితే అదే విజ్ఞానము.
ఆ విజ్ఞానంతో కూడిన శాస్త్రజన్యమైనఅపరోక్షజ్ఞానాన్ని , పరమ ఆప్తుడవు కనుకనేను నీకుఅశేషంగా అనగా సాధనఫలాది సహితంగా చెపుతాను.
ఏ జ్ఞానం తెలిస్తే మరొక జ్ఞానం తెలుసుకోవలసిన అవసరం ఉండదో అని ఎందుకు అన్నాడు? कस्मिन् भगवो विज्ञाते सर्वमिदं विज्ञातंभवति?
एकविज्ञानेन सर्वविज्ञानम् అనే శ్రుతి ప్రతిజ్ఞనుఅనుసరించి,
ఇంకో విషయ జ్ఞానం తెలియనవసరం లేదనుటకు ఆధారం येनाश्रुतं श्रुतं भवति,अमतं मतं,अविज्ञातं विज्ञातं అనే శ్రుతి , ఇతిభావః…mvr
03
_____________________________________
मनुष्याणां सहस्रेषु कश्चिद्यतति सिद्धये ।
यततामपि सिद्धानां कश्चिन्मां वेत्ति तत्त्वतः ॥
_____________________________________
_नन्दिनी
विनैव भगवदनुग्रहं ज्ञानफलं दुर्लभमिति आह-
मनुष्याणां-मनुष्य शब्दग्रहणं मनुष्येतरेषु ज्ञानाभावसूचनार्थम्।मनुष्यत्वं मोक्षाय यतितव्यं इति सूचनार्थम्;
मनुष्याणामपि कश्चिदेव प्रकृष्टपुण्यवशात्
“सिद्धये “- आत्मज्ञानाय यतते;
प्रयत्नं कुर्वतामपि कश्चिदेव
“मां”-अद्वितीयं परंब्रह्म
वेत्ति- विजानाति( अयथाभूतस्वरूपमेवजानाति );
तत्रापि कश्चित् एव “तत्त्त्वतः” -यथास्वरूपतः वेत्ति;
यथास्वरूपः कः ? दृश्यवैशिष्ट्यरहितः इति।यद्दृश्यं तन्नश्यमिति ज्ञानेन इति ज्ञेयम्।
अत्रपूर्वपूर्वापेक्षया उत्तरोत्तरस्य अतिदुर्लभत्वं सूचितम्।
अतिदुर्लभं तदेव ज्ञानं तुभ्यमहं वक्ष्यामीति अर्थः!
In brief,
It is just one person among many ( sahasra means innumerable too) strives to win this knowledge,
It is one among those knowers who knows My reality. (The rarity is being reflected as “one in thousands” .)
నన్దిని
జ్ఞానస్తుతిని చేసి జ్ఞానిస్తుతినీచేస్తున్నాడు-
____________________________
మనుష్యాణాం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే,
యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్త్వతః.
_______________________
లెక్కకు మిక్కిలి ఐన ప్రజలలో ఏ ఒక్కడోయోగసిద్ధికై ప్రయత్నం చేస్తాడు.
మోక్షానికై ప్రయత్నం చేసే సిద్ధులలో కూడా మళ్ళీ యే ఒక్కడో మాత్రమే నా యథార్థ స్వరూపం తెలుసుకోగలడు.
చెప్పబోయే జ్ఞానం చాలా కష్టపడితే గానీ సాధ్యం కాదని చెపుతున్నాడు-
मनुष्याः మనుష్యాః- శాస్త్రీయాధికార యోగ్యత కలవారు
सहस्रेषुసహస్రేషు- ఎందరిలోనో
सिद्धयेసిద్ధయే- సత్త్వశుద్ధిద్వారా ఆత్మతత్త్వజ్ఞానసిద్ధికై
यततां యతతాం- ప్రయత్నించేవారిలో
वेत्ति వేత్తి- యథారూపంగా తెలుసుకుంటాడు, తనకు భిన్నంకాదు అని-సాక్షాత్కరించుకుంటాడు
तत्त्वतःతత్త్వతః- ప్రత్యగభేదంగా,గురువు ఉపదేశించిన తత్త్వమసి మొదలైన మహావాక్యాల సహాయంతో
वेत्तिవేత్తి- తనకన్నా పరమాత్మ భిన్నం కాదు అనితెలుసుకుంటాడు.
………..
నాయందు భక్తి లేకుండా నా జ్ఞానము కష్టసాధ్యమని చెపుతున్నాడు.
అసంఖ్యాతమైన జీవులలో మనుష్యులు కాని జీవులకు శ్రేయస్సు యందు ప్రవృత్తియే ఉండదు. ఆహార నిద్రా భయ మైథునాదులే సర్వస్వము!
మనుష్యులు అని ఎందుకు చెప్పుట? మనుష్యులు కాని జీవులకు
“సంసారంబంధము, బంధం లేకపోవుటయే మోక్షము” ,
అనే జ్ఞానమే ఉండదు అని సూచించేందుకు.
మనుష్యులలో కూడా వేలలో,లక్షలలో शतं सहस्रं लक्षंच सर्वमक्षय्यवाचकम्అని చెపుతారు కనుక,శ్రుతిशतमनन्तं भवति,सहस्रमनन्तं भवतिఅని చెప్పింది కనుక,యే ఒక్కడో ఆత్మజ్ఞానం కోసం ప్రయత్నిస్తాడు.
ప్రయత్నించే వేలలో యే ఒక్కడో,పూర్వజన్మ పుణ్య వశాన ఆత్మను తెలుసుకుంటాడు.
అటువంటి ఆత్మజ్ఞానం కలవారిలోనూ ఏ వొక్కనికో నా అనుగ్రహం ఉండి తత్త్వతః,అంటే యాథాతథ్యంగా - ఉన్నది ఉన్నట్లుగా- నన్నుపరమాత్మనుగా తెలుసుకుంటాడు. అని అర్థం.
లేకపోతే,శివుడు గానో,విష్ణువు గానో,రాముడు గానో,కృష్ణుడు గానో-
1) తననుండి భిన్నంగా ,
2) పరిచ్ఛిన్నంగా ( ఈ పేరు,యీ రూపం,ఇంత సైజు) అని చూస్తారే తప్ప,యథాతథంగా,నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపంగా చూడలేరు!
సామాన్య జీవుల కన్నా మనుష్యులు,
మనుష్యుల కన్నా మోక్షానికై యత్నం చేసేవారు,
యత్నం చేసేవారికన్నా సిద్ధులు,
సిద్ధులలో కూడా యే కొందరో మాత్రమే వేదాంతశ్రవణాదుల ద్వారా భగవజ్జ్ఞానం పొందగలరని చెప్పుటలో పూర్వపూర్వాపేక్షయా ఉత్తరోత్తర ధుర్లభత్వం సూచించబడింది.
అంతటి దుర్లభమైన జ్ఞానాన్ని నేను నీకు చెపుతానూ అని భగవదాశయము ,ఇతిభావః…mvr
04
_____________________________________
भूमिरापोनलोवायुः खं मनो बुद्धिरेवच ।
अहङ्कार इतीयं मे भिन्नाप्रकृतिरष्टधा ॥07.04॥
______________________________________
नन्दिनी
“सहस्रेषु कश्चित् मां वेत्ति " इति प्ररोचनेन अर्जुनं अभिमुखीकृत्य, आदौअपरां स्वां प्रकृतिं (मायाशक्तिं ) बोधयति-
भूमि शब्देन तत्कारणभूतं गन्धं गृह्यते,
आपः” " रसः "
अनलशब्देन तत्कारणभूतं रूपःगृह्यते,
वायु " " स्पर्शः”
खंइति " शब्दः”।
तेषां स्थूलभूतानि किं न गृह्यन्ते? तेषां विकारित्वेन।प्रकृतित्व अभावात्
मनः शब्देन तत्कारणभूत अहङ्कारः गृह्यते
बुद्धि शब्देन समष्टिबुद्धिः महत्तत्त्वं,
अहङ्कार शब्देन तत्कारणं माया,
इति, प्रकृतिः मायाख्या
अष्टधा भिन्ना- अष्टभिः प्रकारैः भेदं आगता सर्वः अपि जडवर्गः ।
वक्ष्यमाण क्षेत्राध्याये इमामेव प्रकृतिं चतुर्विंशति तत्त्वात्मना विवृणोति।
In brief ,
My distinctive eight fold nature is constituted by the Earth,Water,Fire,Air,Space,Mind , Intellect and Ego-sense.
Here the Earthmeans the elemental form of earth etc and not the gross earth.
Saankhya/ Vedanta shaastras say that there exists a Cause for an Effect,the कार्यकारण संबंधः .
So, Earth refers to the rudimentary element ( तन्मात्रा)of earth,‘water’ etc.refer to their rudimentary elements of water,fire,air,space…
The rudimentary element
for the Earth is Smell
for the Water , it is Taste
for the Fire,it is Form
for the Air,it is Touch
for the Sky,it is Sound
Likewise Mind refers to the cause of Mind,मनसः कारणं अहङ्कारः, the ego-sense.
Intellect refers to the causeof the’ego-sense’ in this shloka , बुद्धिः इति अहंकार कारणं . The ego-sense is in this shloka is unmanifest-cum- nescience,अहंकार इति अविद्यासंयुक्तं अव्यक्तम् . ( it’s like,we address the poisonous food as poison).
The root cause,the Unmanifest,impelled by the impressions of the ego-sense (styled as the ego-sense) is what causes Activity, अहंकारः सर्वप्रवृत्तिबीजम् .
____________________________
భూమిరాపోఽనలో వాయుఃఖం మనో బుద్ధిరేవ చ ,
అహఙ్కార ఇతీయం మేభిన్నా ప్రకృతిరష్టధా॥07.04॥
____________________________________
నా మాయాశక్తి లోని అపరావిభాగంఎనిమిది విధాలుగా ఉన్నది- పృథివ్యాపస్తేజోవాయురాకాశాలు,మనోబుద్ధ్యహంకారాలు.
నన్దిని
విశిష్టఫలత్వం చేత జ్ఞానం దుర్లభమైనదని,ప్రరోచనం చేసి శ్రోతను అభిముఖం చేసుకున్న భగవంతుడు-
భూమిః - భూమి యొక్క సూక్ష్మభూతం
ఆపః- నీటి సూక్ష్మభూతం
అనలః- అగ్ని యొక్క సూక్ష్మభూతం
వాయుః- గాలి యొక్క సూక్ష్మభూతం
ఖం- ఆకాశం యొక్క సూక్ష్మభూతం,
మనః- మనస్సుకు ప్రకృతి యైన అహఙ్కారం
బుద్ధిః- అహఙ్కారానికి కారణమైన మహత్తత్వం,
ఇతి- ఈరీతిగా
ఇయం ప్రకృతిః- ఈ ప్రకృతి
అష్టధా భిన్నా- ఎనిమిది రూపాలలో విభిన్నంగా ఉన్నది.
భగవంతుడు తన స్వరూపాన్ని చెపుతున్నాడు-
నా శక్తి రెండు విధాలు …
A. అపరా శక్తి ,
B.పరా శక్తి.
……………. …………. ……
అపరా శక్తి- నికృష్టము, జడము.
ఆ అపరాశక్తిఅష్టవిధము, అపరాశక్తి లోని సూక్ష్మ భూతాలు ….
1 . భూమి యొక్క తన్మాత్ర , వాసన
2.నీటి తన్మాత్ర,రసము
- అగ్ని యొక్క తన్మాత్ర , వేడి
4 . గాలి యొక్క తన్మాత్ర,స్పర్శ
5 . అవకాశము యొక్క తన్మాత్ర,శబ్దము
…………
- మనస్సు అంటేఅహంకారం
7.బుద్ధి అంటేసమష్టి బుద్ధి
- అహంకారం అంటే దాని కారణమైన మాయ .
……………. ………………. .
(ఈవిధంగా ఐదు మహాభూతాలూ + ఐదు కర్మేంద్రియాలూ + ఐదు జ్ఞానేంద్రియాలూ + మనస్సూ వెరసి 16ప్రకృతి వికారాలూ నా శక్తి ప్రకటనకు ఉపాదాన కారణము), ఇతిభావః…mvr
05
______________________________________
अपरेयमितस्त्वन्यां प्रकृतिं विद्धि मे पराम् ।
जीवभूतां महाबाहो ययेदं धार्यते जगत् ॥
_______________________
नन्दिनी
परापरशक्तिद्वये अष्टधा भिन्ना प्रकृतिः “अपरा” इति प्रोक्ता।अपरा प्रकृतिः निकृष्टा ,
१जडत्वात्
२परार्थत्वात्
३संसारबन्धरूपत्वात् च ।
प्रकृतेः अन्यां
तु-अभेद अयोग्याम्
जीवभूतां- चेतनाम्
प्रकृतिं-शक्तिम्
मे-मदात्मिकाम्
विद्धि-जानीहि।
यया
इदं- क्षेत्रसंज्ञकं शरीरादिरूपम्
जगत्-अचेतनजातम्
धार्यते-विशीर्यत् जगत्( सर्वजीवदेहेषु स्थित्वा प्राणान् देहेषु धारयति) ।
“अनेन जीवेन आत्मना अनुप्रविश्य नामरूपे व्याकरवाणि " इति श्रुतेः।
महाबाहो !-महाबाहुना त्वया विनश्यत् क्षत्रधर्मं धारयितुं तथा इति ।
Inbrief,
O hero,the protector of Dharma and Kingdom!
I have a higher nature too . That constitutes the living being by which this world is upheld.
The inferior,impure,troublesome nature is the essence of bondage.
My essential,pure,higher nature is the “knower of the field”- क्षेत्रज्ञः . This world is both penetrated and
upheld अन्तःप्रविष्टः,धारयति च
by this particular nature.
శ్రీమద్భగవద్గీతా ॥
అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధిమే పరామ్ ।
జీవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగత్ ॥7.5॥
_____________________________________
నన్దిని
वसतीवरी, (వసతీవరీ అనేది పాశుక కాండం సమాప్తమై అధ్వరకాణ్డ ప్రారంభం ఐన సందర్భంలో వచ్చే మన్త్రాన్తర్భాగ ఆఖ్యాయిక కు సూచిక.
ఆగ్నీధ్రమండపం లో దేవతలు తమ తమ భాగాలనువిభజించుకున్న పిదప అవశిష్టభాగాన్ని “మరు దివసం పొద్దున్నే పునర్విభజన చేసుకుందాము” అని అప్పటికి ‘వసతు’ అని,వదిలి పెట్టి- మరుసటి ఉదయం తిరిగి వచ్చిపంచుకున్నారు. కనుక’యోగాత్’ మిగిలినదాన్ని వసతీవరీఅంటున్నాను . वसत्वित्युक्त्वा उर्वरितं तद्वस्य आपो वसतीवर्यःఅటువంటిముఖ్యమైన, శేషభూత విషయం కనుకవయసీవరీ అని నా సంబుద్ధి. 😊 )
గతశ్లోకంలో అష్టధాఅపరాప్రకృతి ని వర్ణించి , ప్రస్తుతం ఇంకో “పరా” ప్రకృతిని వివరించబోతున్నాడు-
పూర్వశ్లోకంలో చెప్పిన అపరాప్రకృతి కన్నా భిన్నంగా,శ్రేష్ఠమైన నా
“పరాప్రకృతి” ని గూర్చి కూడా తెలుసుకో.
పరాప్రకృతి వల్లనే యీ జగత్తు నిలిచి వున్నది.
ఇయమ్ అపరా-ఇంతవరకూ చెప్పింది అపరా ప్రకృతి.
ఇతః అన్యామ్- దీనికన్నా వేరైన
మేపరామ్ ప్రకృతిమ్-నా శ్రేష్ఠ ప్రకృతిని గురించి కూడా
విద్ధి-తెలుసుకో!
…….. …….. ……. ……
యయా- దేనిచేత
ఇదం జగత్- ఈ జగత్తు
ధార్యతే-ధరించబడుతున్నదో…
అపరాప్రకృతి ఎనిమిది విధాలుగా ఉంటుందని క్షేత్రజ్ఞానాన్ని వివరించిన భగవంతుడు,పరా ప్రకృతిని గురించి అనగా క్షేత్రజ్ఞుని గూర్చికూడా చెప్పబోతున్నాడు.
ఈశ్లోకంలో పరాపరత్వభేదం చెపుతున్నాడు.అష్టధా నిరూపితమైన ప్రకృతి ‘అపర’ , ఇది నికృష్టమైంది,జడము, క్షేత్రము.
పరాప్రకృతి ఉత్కృష్టము,సచేతనము,జీవభూతము,జగత్తును ధరించేది. క్షేత్రజ్ఞము.
జగత్తును ధరించేది -जीवेनात्मनानुप्रविश्य नामरूपे व्याकरवाणिఅని శ్రుతి చెప్పినది.
పర శక్తీ,అపరశక్తీ ఉభయమూ కలిగిన వాడని విష్ణుపురాణం विष्णुशक्तिः परा प्रोक्ता क्षेत्रज्ञाख्या,तथाఽपरा అని చెప్పింది.
तु శబ్దం ఎందుకు వాడినట్లు?
అభేదానికి యోగ్యం కాకపోయినా -
అచేతనవర్గమూ,క్షేత్రలక్షణమూ,ఐన జీవభూతుణ్ణి కూడా విశుద్ధుడైన,
పరాప్రకృతిగానే ఏదో ఒక విధంగా గ్రహించుమని- జహదజహల్లక్షణ చేత సాధించుమని అర్థము.
జహదజహల్లక్షణ అంటే ఏమిటి ?
लक्षणा = शक्यः संबन्धः, जहदजहल्लक्षणा = एकदेशपरित्यागेसत्येकदेशपरिग्रहरूपा విషయంలో కొంత భాగం స్వీకరిస్తూ, మఱి కొంత వదలిపెట్టుట.దీన్నే ‘భాగత్యాగ లక్షణ’ అని కూడా పిలుస్తారు. ( ALL OR NONE కు వ్యతిరేకము) .
परास्यशक्तिर्विविधैव भूयते అనే శ్రుతి ప్రకారం నా ప్రకృతిని జీవుడుగా కూడా తెలుసుకొమ్మని అర్థము.
పూర్వశ్లోకంలో అధమమైనజడాత్మక ప్రకృతిని నిర్దేశించి, ఇక్కడ జడము కాని జీవభూతుణ్ణి भूसत्तायाम् కనుక, ప్రాణధర్మం దేహంలో నిలిపేవానిగా जीव प्राणधारणे కనుక జీవుణ్ణి భగవంతునిగానే అవగతం చేసుకొమ్మని అన్తరార్థము.
‘భూమిరాపోనలో..’ అనే శ్లోకంలో నికృష్టమైన తన ప్రకృతిని చెప్పి,‘అపరేయమ్’ అనే శ్లోకంలో తనదే అయిన ఉత్కృష్ట ప్రకృతిని వర్ణించి - ఈ పరా ప్రకృతి ప్రాణాలకు ఆధారం అంటున్నాడు - అంటే యీ పరాప్రకృతిअन्तर्बहिश्च तत्सर्वं व्याप्य नारायणः स्थितः అనే శ్రుతిలోని నారాయణ స్వరూపమే!
ఈ పరాప్రకృతియే జీవుడుగా మనతో పుణ్య పాపాదికర్మలు చేయిస్తున్నదా? లేదు.జీవుడు చేయించుట,చేయుట,అనుభవించుట లేదు.
పక్కనే ఉన్న బుద్ధిని తానుగా అనుకుంటూ,అనుకుంటూ conditioned అని మనశ్శాస్త్రం లో చెప్పినట్లు , జీవుడు తానే కర్త అనే భ్రమలో పడి ఉన్నాడు.బుద్ధి లక్షణాలను తనకు ఆపాదించుకుంటున్నాడు అని అర్థం. नाहं कर्ता అని శ్రుతి చెప్పుతూ ఉన్నది.
మహాబాహూ అని ఎందుకు సంబోధన?
జగద్ధర్మం నిలిపి ఉంచే బాహుయుక్తునివి,క్షాత్రధర్మం ధరించగలవానివికనుక నీవుమహాబాహువువు , అని ఉద్బోధ.ఇతిభావః…mvr
श्रीमद्भगवद्गीता विज्ञानयोगः 07.06
( भगवतो महदैश्वर्यस्वरूपम् )
______________________________________
एतद्योनीनि भूतानि सर्वाणीत्युपधारय ।
अहं कृत्स्नस्य जगतः प्रभवः प्रलयस्तथा ॥
_____________________________________
नन्दिनी
अपराप्रकृतेः, पराप्रकृतेः च कार्यमाह-
एते-जडचेतने ,क्षेत्र क्षेत्रज्ञ संज्ञके
योनीनि-योनिः ( कारणभूतं)येषां तानि
सर्वाणि-चराचराणि भूतानि
इति उपधारय- इति जानीहि।(अचेतनप्रकृतिः स्वरूपपरिणामेन परिणमते,
चेतनरूपा भोक्तृत्वेन देहेषु प्रविश्यस्वकर्मणा तानि धारयति।
अहं-अहमेव
कृत्स्नस्य-सप्रकृतिकस्य
जगतः
प्रभवः-प्रकर्षेण भवत्यस्मात् इति प्रभवः ,( अहं परं कारणम्)
तथा
प्रलयः-प्रलीयते अनेन इति प्रलयः (संहर्ता अपि अहमेव) ।
कर्ता संहर्ता च अहमेव इत्यर्थः।
In brief ,
Know all the beings to be born of this dual,परा/ अपरा,nature ie lowerand higher. I am the source of the entire world as well as that into which it is dissolved.
The lower and higher nature constitute the ‘field’ क्षेत्र andthe ‘field knower ’ क्षेत्रज्ञ . These two are the womb of the universe.
The birth and death ( dissolution) of the world are due to Me.
శ్రీమద్భగవద్గీతా 07.06
____________________________
ఏతద్యోనీని భూతాని సర్వాణీత్యుపధారయ ।
అహం కృత్స్నస్యజగతః ప్రభవః ప్రలయస్తథా॥
____________________________
భగవంతుడు తన ప్రకృతులను రెండింటినీ చెప్పి,అటు సృష్టీఇటు లయమూ కూడా తనే అధిష్ఠానంగా జరుగుతున్నాయని చెపుతున్నాడు-
అన్ని భూతాలూ ( ప్రాణులూ) నా పర,అపర అనే ప్రకృతులనుండియే పుట్టుతున్నాయి.
సమస్త జగత్తుకూ ఉత్పత్తి స్థానం నేనే,లయస్థానం కూడా నేనే!
సర్వాణి భూతాని- భూతాలుఅన్నీ
ఏతద్యోనీని ఇతి- ఈ పరాపర ప్రకృతులు కారణంగానే అని
ఉపధారయ- తెలుసుకో.
…………….
కృత్స్నస్య జగతః- సమస్త జగత్తుకూ
అహమ్- నేను
ప్రభవః- ఉత్పత్తి స్థానాన్ని
తథా- మరియు
ప్రలయః- లయస్థానాన్ని కూడా
ఈ శ్లోకంలో భగవంతుడు తనఅపరాప్రకృతికీ, పరాప్రకృతికీ కల కార్యాన్ని చెపుతున్నాడు.ఈ రెండు ప్రకృతులూ అనగా జడమూ,చేతనమూ చరాచరాల దేహాలకుకారణాలు అని తెలుసుకో!.
అచేతన ప్రకృతి స్వరూపపరిణామంగానూ,చేతనరూపమేమో ఆ శరీరాలలో ప్రవేశించి భోక్తృత్వంతోనూఆధారంగానూ ‘యోని’ అనగా కారణంగా ఉంటున్నాయి.
జీవం లేకుండా దేహాలకు స్థితీ,అభివృద్ధీ ఉండవు , కనుక స్థితీ,వృద్ధీ కూడా పృథక్కుగా (విడిగా) ప్రవృత్తి లేనివే, ఇవినా అధీనంలో ఉన్నవే.
సృష్టికి నిమిత్తమూ, ఉపాదానమూ రెండూ నేనే ( నేనుఅభిన్న నిమిత్తోపాదాన కారణమును.)
ఉపాదానము అనుటకు जन्माद्यस्य यतः, साक्षाच्चोभयाम्नायात्అని వ్యాసుని సూత్రములు ఆధారము.
నిమిత్తము అనుటకు లోకములో కుమ్మరి- కుండను తయారు చేయుట- దృష్టాన్తము.
సంపూర్ణ జగత్తూ నా నుండియేప్రభవమవుతుంది- కనుక నేనుపరమ కారణాన్ని.అలాగే నేనే సంహారస్థానాన్ని కూడా. प्रकर्षेण भवत्यस्मादिति प्रभवः, प्रलीयन्ते अनेनेति प्रलयः- संहर्ता अहमेव । ( ऋग्वेदः - य इमा विश्वा बुवनानि जुह्वद् ऋषिर्होता न्यपीदत्पिता नः- त्रयोदशर्चं वैश्वकर्मदैवत्यं त्रैष्टुभम्)
……….. ……….. ………..
చెప్పబడిన ప్రకృతిద్వయం యొక్క కార్యం ఇది- కావ్యలింగక అనుమానం ప్రమాణంగా జగత్ సృష్టి కారణాన్ని చెపుతున్నాడు.
“హేతువు యొక్క వాక్యార్థం అథవా పదార్థం యుక్తితో సమర్థించుట కావ్యలింగం.”
ఉదాహరణకు-
ఆదిశంకరులు,
“శివా! నా రెండు తప్పులను మాత్రంమన్నించు; 1)పూర్వజన్మలో నీకునమస్కరించకపోవుట ఒక తప్పు ( నమస్కరిస్తే యీ జన్మ వచ్చి ఉండేది కాదు కదా) ,
2) వచ్చే జన్మలో నమస్కరించక పోవుట రెండో తప్పు ( ఈ జన్మలో నమస్కరిస్తున్నాను గనుక ఇంకో జన్మయే ఉండదు కదా!! , అన్నారు.पुराजन्मनि भवन्तं न प्रणतवान् ,अग्रेपि अनताभाक्,एतत् अपराधद्वयं ।)
ఇక్కడ కారణం చిదచిత్ గ్రంథి; కనుక కార్యమూ చిదచిద్గ్రంథిరూపమే.
గ్రంథి అంటే ముడి.
చిదచిత్ గ్రంథి అంటే దేహము + దేహి , ఈ రెండింటిముడి.ఇది పంగ్వంధసంబంధం వంటిది. ( పంగు =కుంటి; అంధ= గ్రుడ్డి )
చిదచిత్ గ్రంథి = అచిత్తయిన అహంకారమునూ,చిద్రూప కూటస్థుణ్ణీ ఒకటిగా తలచుట, ఇతిభావః…mvr
07
_____________________________________
मत्तः परतरं नान्यत् किञ्चिदस्ति धनंजय ,
मयि सर्वमिदं प्रोतं सूत्रे मणिगणा इव ।
_____________________________________
नन्दिनी
वसतीवरी …
मत्तः - मायाधिष्ठानात् , सत् एवं स्फुरणरूपेण च परमेश्वरात्
परतरं - परमार्थसत्यम्
अन्यत् किञ्चिदपि नास्ति -
अन्यत् - सांख्यस्य प्रधानं वा/ नैयायिकस्य परमाणुलक्षणं वा
किञ्चिदपि - न किञ्चित् भवितुमर्हति, अन्यस्य अस्तित्वे न किञ्चित् प्रमाणमस्ति!
(“नेह नानास्ति किञ्चन " इति श्रुतेः )
धनंजय ! - दिग्विजये , उत्तरगोग्रहणे च राज्ञो विजित्य धनमाहृतवतः त्वत्तः परतरः एतादृशकर्मकर्ता अन्यो यथा नास्ति
तथा मत्तः परं अन्यत् जगत्कारणं नास्ति।
मयि सर्वमिदं प्रोतं - स्थितिहेतुरपि अहमेव ,
मयि - सद्रूपे ( मत्सत्तया सत् इव ), स्फुरणरूपे च ( मत् स्फुरणेन च स्फुरदिव )
सर्वमिदं - जडजातम्
प्रोतं - ग्रथितम् ( कल्पितम् )
सूत्रे - तैजसात्मनि हिरण्यगर्भे
स्वप्नदृशि स्वप्नप्रोता मणिगणा इव।
In brief ,
There’s nothing whatsoever beyond Me.
All this is strung on Me like clusters of gems on a thread.
There is no Causal stuff-
Beyond Me = the Supreme Lord मत्तः = परमेश्वरात् . I am the Cause for the world, all alone.
Entire world is woven - as a cloth on the warp
or
clusters of gems on a thread.
శ్రీమద్భగవద్గీతా 07.07
నేను ఎందుకని జగదుత్పత్తి, లయాలుగా ఉన్నానో అందువల్ల
మత్తః పరతరం నాన్యత్ కిఞ్చిదస్తి ధనంజయ,
మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ.7.07
జగత్తు యొక్క సృష్టి , స్థితి, లయాలకు
నాకంటే శ్రేష్ఠతరమైన కారణం మరొకటి లేదు. ఉన్నదిఅంతా నాలో దారంమీది వస్త్రం వలె కేవలం పడుగూ పేకా అల్లబడినట్లు, ఆధారమైన సూత్రంలో ఆధేయమైన మణుల సమూహం వలె కూర్చబడి ఉన్నది.
ధనంజయ! - ఉత్తర గోగ్రహణం లో భీష్మాది వీరులనందరినీ ఒంటిచేత్తో గెలిచి గోధనాన్నీ , రాజసూయాంతర్గత దిగ్విజయయాత్ర సమర్థంగా నిర్వహించి రాజుల నుండి కప్పాలు స్వీకరించీ స్వర్ణ, రత్న, ద్రవ్యాది ధనాన్నీ ఆహరించగలిగిన నీకన్నా పరతరుడైన ఏతాదృశకర్మకర్త మరొకడు లేనట్లే - నాకన్నా పరతరుడైన జగత్కర్త అన్యుడు ఉండడని అన్యాపదేశంగా ధనంజయ సంబోధన.
మత్తః - నాకన్నా
పరతరమ్ - ఎక్కువగా శ్రేష్ఠమైన
కిఞ్చిత్ నాస్తి - ఏ కొద్ది విషయం కూడా లేదు
………….
ఇదం సర్వమ్ - ఇదంతా
సూత్రే - దారంలో/ దారంతో
మణిగణా ఇవ - మణుల గుత్తులవలె
మయి ప్రోతమ్ - నాలో గుచ్చబడి ఉన్నది.
ఆత్మ సర్వోత్కృష్టమూ, సర్వ ఆధారత్వమూ అని యీ శ్లోకంలో చెపుతున్నాడు.
అఖిల జగత్తుకూ మూలమైన జడమూ, చేతనమూ కూడా అయిన , సర్వాశ్రయమైన నాకన్నా శ్రేష్ఠమైనది యేదీ లేదు.
न तत्समश्चाभ्यधिकश्च दृश्यते, स कारणं कारणाधिपाधिपः सर्वस्य वशी सर्वस्येशानः स द्विश्वकृदात्मयोनिः प्रधानक्षेत्रज्ञपतिर्गुणेशः అనే శ్రుతి యీ అర్థావబోధకమే.
ఈ విషయంలో దృష్టాన్తం - సూత్రే మణిగణా ఇవ , అని. ఏవిధంగానైతే
మణిహారంలోని మణుల స్థితి ప్రవృత్తులు దారం యొక్క అధీనంలో ఉంటాయో అదేవిధంగా అన్ని/ అందరి స్థితీ, ప్రవృత్తీ నా అధీనంలో ఉంటాయి.
यच्च किञ्चिज्जगत्सर्वं दृश्यते श्रूयतेपिवा, अन्तर्बहिश्च तत्सर्वं व्याप्य नारायणः स्थितः అనే శ్రుతీ,
बुद्धिर्मनो महद्वायुस्तेजोंभः खे महीच या । चतुर्विधंच यद्भूतं सर्वं कृष्णे प्रतिष्ठितम् అనే స్మృతీ ఇదే విషయాన్ని ఆవిష్కరిస్తున్నాయి.
స్వప్నంలోని మణులు కలగనేవాని కల్పితాలు ; తైజస రూపంలోని సూత్రాత్మ యైన జీవునికి యీ జగత్తులోని వస్తుజాతమూ అంతే!.
భగవన్తుని కన్నా ఉత్కృష్టం మరొకటి లేదు. కనబడే విచిత్ర భూతజాతమంతా - విచిత్ర వర్ణ, పరిమాణ, ఆకృతులు గల మణులు ఒకే సూత్రంలో అల్లబడి ఉన్నట్లుగా- భగవన్తునిలో కూర్చబడి ఉన్నది , ఇతిభావః…mvr
08
_____________________________________
रसोहमप्सु कौन्तेय! प्रभास्मि शशिसूर्ययोः,
प्रणवः सर्ववेदेषु शब्दः खे पौरुषं नृषु
_ वसतीवरी
नन्दिनी
जगतः स्थितिहेतुत्वमाह -
“यदग्ने रोहितं रूपं तेजसः तद्रूपं यच्छुक्लं, तदपां यत्कृष्णं , तदन्नस्यापागादग्नेरग्नित्वं, वाचारम्भणं विकारो नामधेयं …” इत्यादि श्रुत्युक्तप्रकारेण सर्वभूतानां कारणात्मना तिष्ठतः सत्ताभावं प्रतिपादयति -
अप्सु रसोस्मि - रसरूपेण तिष्ठामि, रसात्मके मयि आपः प्रोताः ,
शशिसूर्ययोः अहं प्रभा अस्मि - तत्कारणप्रभारूपेण तयोः तिष्ठामि , मयि तौ प्रोतौ,
प्रणवः सर्ववेदेषु - ऋगादिषु ( वैखरी) ओं काररूपेण तिष्ठामि , ओंकाररूपेण मयि स्वकारणे वेदाः प्रोताः ,
खे शब्दः - व्योम्नि शब्दः अस्मि , तत्कारण शब्दरूपेण तिष्ठामि, मयि स्वकारणे खं (आकाशं) प्रोतं, मदात्मना मयि तिष्ठति ,
नृषु = पुरुषेषु
अहं पौरुषमस्मि - पौरुषं = उद्यमः अस्मि, तदात्मके मयि पुरुषाः प्रोताः, मयि तिष्ठन्ति।
रसोहमप्सु
रसः = “रसो वै सः” इति श्रुतेः। परंब्रह्मा। रसनेन्द्रियमात्रग्राह्यगुणः। भक्तियुतज्ञानमात्रेणैव विदितः।
रस्यते आस्वाद्यते इति, रस आस्वादने,
सामाजिकैः रस्यन्ते आस्वात्यन्ते इति वा,
“आपो हि ष्ठा मयोभुवस्ता न ऊर्जे दधातन। महे रणाय चक्षसे …”
हि - एव
आपः- हे आपः! ( यूयमेव )
मयोभुवः स्थ- सुखस्य भावयित्र्यो भवत।
ताः- तादृश्यः यूयम्
नः- अस्मान्
ऊर्जे- रसाय = भवदीयरसानुभवार्थम्
दधातन- स्थापयत
महे रणाय- महते रमणीयाय
चक्षसे- दर्शनाय
( दधातन )
अस्मान् परतत्त्वसाक्षात्कारयोग्यान् कुरुत।
“यो वः शिवतमो रसस्तस्य भाजय तेह नः।”
वः- युष्माकम्
शिवतमः- सुखैकहेतुः, शान्ततमः
रसः- यः ‘रसः’ अस्ति
तस्य भाजयत- तं रसं प्रापयत।
मातरः- प्रीतियुक्ताः मातरः
उशतीः इव- यथा रसान् ( स्तन्यान् ) प्रापयन्ति तथा।
“तस्मा अरं गमाम वो यस्य क्षयाय जिन्वथ। आपो जनयथा च नः "
यस्य- यस्य रसस्य
क्षयाय- निवासेन
जिन्वथ- प्रीता भवत
अरं- अलम्
गमाम- प्राप्नुमः।
आपः- यूयम्
नः- अस्मान्
जनयथ- धर्मप्रजोत्पादकान् कुरुथ।
In brief,
I am the essence, flavour of water,
I am the essence of light of sun , stars etc.
I am the essence of sacred syllable “Om” of Vedas,
I am the essence of sound in the environs and
I am the essence of “I ness” of creatures.
The elements in their rudimentary state possessing their own characteristic attributes. The rudimentary ’ether’ aakaasha, is endowed with the quality of sound only.
Elements are both subtle and gross- Chandogya Upanishad 6.3.3 talks of Trivritkaranam.
నన్దిని
భగవంతుడే పరమప్రాప్యం, చరాచర జగత్తంతా అతనియందే ఓతప్రోతమని తెలిపి, సర్వవస్తుసారమూ భగవంతుడైన తానేనని విశదం చేస్తున్నాడు.
రసోహమప్సు కౌన్తేయ! ప్రభాస్మి శశిసూర్యయోః,
ప్రణవః సర్వవేదేషు శబ్దః ఖే పౌరుషం నృషు ॥7.08॥
నీటిలోని రసతత్త్వాన్ని నేను, సూర్య నక్షత్రాది ఖగోళాల కాంతి తత్త్వాన్ని నేను, సర్వవేదాలలోని ప్రణవతత్త్వాన్ని నేను, ఆకాశపు శబ్ద తత్త్వాన్నీ, మనుష్యులలోనీ పుంభావాన్నీ నేనే!
అహమ్ - తత్ శబ్ద వాచ్యుడనైన నేను
అప్సు రసః అస్మి - నీటిలోని రసాన్ని
శశి సూర్యయోః ప్రభా అస్మి - ఖగోళాల కాంతిని
సర్వవేదేషు ప్రణవః - వేదాలకు ఓంకారాన్ని
ఖే శబ్దః - ఆకాశానికి తల్లక్షణమైన శబ్దాన్ని
నృషు పౌరుషమ్ - ప్రాణులలో పురుషకారాన్నీ నేనే.
శ్రుతి , महीनां पयोस्योषधीनां रसस्तस्य तेक्षीयमाणस्य निर्वपामि అని హవిర్గ్రహణసందర్భంలో हे आज्य, त्वं महीनां = गवां, पयः असि, साक्षात् तज्जन्यत्वात्, ओषधीनां रसः चासि అని ఆయావస్తువులలో రసస్వరూపంగా, అంతర్లీనంగా ఉన్న పరమాత్మ భావాన్నే వర్ణించింది.
(ఈ రసము సంస్కారరూపమూ కావచ్చును. ఉదాహరణకు అదే ప్రకరణంలో चक्षुषावेक्षे అని యజమాని యొక్క పత్ని చూపుపడితే చాలు, पत्न्यवेक्षितमाज्यं भवति అని ఆ ఆజ్యానికి హవిస్సుగా మారే అర్హత ఆమె చూపుతోనే సంప్రాప్తమౌతుందని చెప్పింది. )
ఇప్పటినుండి ఐదు శ్లోకాలలో భగవంతుడు తన “తన్మాత్ర” స్వరూపాన్ని చెపుతున్నాడు. ( तन्मात्रा - एतान्येव सूक्ष्मभूतानि तन्मात्राण्यपंचीकृतानि चोच्यन्ते , the elements in their rudimentary state possessing their own characteristic attributes.
The rudimentary ’ether’ aakaasha, is endowed with the quality of sound only.
Elements are both subtle and gross- Chandogya Upanishad 6.3.3 talks of Trivritkaranam तासां त्रिवृतं त्रिवृतमेकैकाकरोत् यथातु खलु सोम्येमास्तिस्रो देवतास्त्रिवृत्त्रिवृदेकैका भवति …)
నీటిలోని సారభూతమైన రసం- రస తన్మాత్ర రూపంలో, జలానికి ఆశ్రయం నేనే.
అలానే సూర్యాదుల ప్రకాశరూపంలో ఉన్న ప్రభను నేనే.
వాక్కుకుగల పరా పశ్యంతీ మధ్యమా వైఖరీ రూపాలలోని వైఖరి, సర్వవేదాలలో ప్రణవరూపంగా ఆవిర్భవించిన సందర్భంగా మూలభూతమైన ఓంకారాన్ని నేనే. (प्रणवश्छन्दसामिव - रघुवंशम् 1.11),
ఆకాశంలోని శబ్ద తన్మాత్రను నేనే.
మనుష్యులలోని పురుషకారాన్ని నేనే.
….ओं कारेण सर्वा वाक् అని శ్రుతి చెప్పింది ,
కౌన్తేయ! అనే సంబోధన-
తన్మాత్రలు నాలో ప్రోతాలై ఉన్నపుడు, నా మేనత్త కొడుకువే ఐన నీలో కూడా ఉండుట అసంభావన కాదు సుమా అని సూచన!, ఇతిభావః…mvr
09
_____________________________________
पुण्यो गन्धः पृथिव्यांच तेजश्चास्मि विभावसौ,
जीवनं सर्वभूतेषु तपश्चास्मि तपस्विषु ।
____________________________________
नन्दिनी
पृथिव्यां च अहं पुण्यो गन्धः …
पुण्यः - मनोहरः , शुद्धः।
मनोहरत्व, शुद्धत्व उक्तिः पञ्चानामपि कारणानां उपलक्षणार्थम् । गन्धात्मके स्वकारणे मयि पृथिवी प्रोता।
तेजश्चास्मि विभावसौ …
विभावसौ - अग्नौ,
तेजः अस्मि - तेजःस्वरूपे मयि
अग्निः प्रोतः , तेजःस्वरूपे मयि
तिष्ठति ।
जीवनं सर्वभूतेषु …
सर्वेषु भूतेषु = प्राणिषु अहं जीवनं
अस्मि ।
जीवनं - जीवनकरणं, अन्नादिः।
अन्नरसात्मना प्राणिषु तिष्ठामि।
तपः च अस्मि तपस्विनौ …
तपः - कृच्छ्र चान्द्रायणादिकम् /
चित्तैकाग्र्यं तपः वा
तपस्विनौ - तेषु अहं तपोरूपेण तिष्ठामि। ते तपोमये मयि तिष्ठन्ति।
वानप्रस्थादिषु द्वन्द्वसहनरूपं तपः अस्मि।
In brief ,
I am the unadulterated odour in the earth,
I am the useful burning nature of the fire,
I am the beneficial living nature in creatures,
I am the pure austerity in ascetics.
These meritorious features become demeritorious when they come in contact with ignorance and adharma.
శ్రీమద్భగవద్గీతా 07.09
____________________________
పుణ్యోగన్ధః పృథివ్యాంచ తేజశ్చాస్మి విభావసౌ,
జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు.
____________________________
నన్దిని
నేనే భూమికి సంబంధించిన శ్రేయోదాయకమైన సువాసనగా , నేనే సూర్య తేజస్సును , నేనే సకలజీవులకూ ఆహారాన్ని, నేనే తపస్వుల లోని తపస్సును .
పృథివ్యాం - భూమిలో ఉండే
పుణ్యః గన్ధః - మేలును చేసే వాసనను.
విభావసౌ - అగ్ని, సూర్యాదుల
తేజః చ - తేజస్సును కూడా నేనే.
సర్వభూతేషు - ప్రాణులన్నిటిలో
జీవనమ్ - ఆహారాన్ని అయి ఉన్నాను.
తపస్సు చేసేవారిలోని తపస్సునూ నేనే.
वसतीवरी
జగత్తులోని సారభూతత్వం నేనేననీ, ఈ విశ్వమంతా నాలోనే/ తాను అధిష్ఠానంగానే ఉన్నదనీ చెప్పిన భగవంతుడు
మనుష్యుడు స్వతః పుణ్య స్వరూపుడే ఐనా అవిద్యా , అజ్ఞానాల వల్ల పుణ్య రహిత సంసారి అవుతాడని చెపుతున్నాడు -
पुण्यःगंधः అవికృత గంధము, సురభిళము . సర్వ భూమికీ సారభూతమైన గంధ తన్మాత్ర .
‘చ’ కారము నీరు మొదలైన సర్వమూలకాలకూ పుణ్యరసమూ ఆదిగా సముచ్చయార్థము- అన్నిటికీ వర్తించేది. శబ్ద స్పర్శ రూప రస గంధాలకు స్వభావతః పుణ్యత్వము ( అవికృతమైనది) ఉంటుంది. అధర్మం వల్ల మనుష్యులలో పాపం వస్తుందేమోగానీ స్వభావతః అందరూ పుణ్యజీవులే అనుట. వాయువు మొదలైన వాటివలన ఉష్ణం కావలసిన వారికి వేడీ, శైత్యం కావలసినవారికి చలీ కూడా నేనే.
సర్వప్రాణులకూ ప్రాణధారకమైన ఆయువును నేనే; ఆవిధంగా ప్రాణులన్నీ నాతో కూర్చబడి ఉన్నాయి. विशेषणाभावे विशिष्टाभावःకనుక తపస్వులలోని తపస్సును నేనే, తపోరూపంలో వారు నాతో ముడివడి ఉన్నారు.
‘తపశ్చ ’ అనుట లోని చకారంతో ఆన్తరమైన చిత్తైకాగ్ర్యమూ, బాహ్యమైన జిహ్వా నిగ్రహం/ ఉపస్థానిగ్రహం కూడా సముచ్చయంగా చెప్పినట్లు భావించవలెను ,
అంతే కాదు, అగ్ని కి తేజంగా స్వాభావికంగా సర్వదహన, సర్వప్రకాశ సామర్థ్యం కూడా నేనే. దహన ప్రకాశాదులు వినా అగ్నికి పృథక్స్వరూపాభావం కాన- తదాకారత, తదాత్మనా తత్రావస్థానం కనబడుతున్నది కూడా, ఇదేవిధంగా-
ఈ ఉపలక్షణంతో మిగతా మూలభూతాలకూ ఇది వర్తిస్తుంది.
సర్వజీవులకూ జీవనం = ప్రాణధారణమైన ఆయువును- కూడా నేనే.
తపస్వులలో తపస్సే ప్రధానంగా జీవించేవారి అనగా వానప్రస్థులు మొదలైన వారి తపస్సు- అనగా శీతోష్ణాది ద్వన్ద్వసహన సామర్థ్యం కూడా - నేనే ,
తపః - తపస్సు
अतप्ततनूर्नतदामो अश्नुते అనుచో తప్తతనువు = తపస్సు చేసిన తనువు. ( కాగా,
తప్త తనువు = కాల్చబడిన శరీరము, చక్రాంకితాదులతో కాల్చుకొనుట అని ద్వైతులు ఆచరించుట మనకు అనుభవగోచరమే), ఇతిభావః…mvr
10
____________________________
बीजं मां सर्वभूतानां विद्धि पार्थ सनातनम् ,
बुद्धिर्बुद्धिमतामस्मि तेजस्तेजस्विनामहम् ।
____________________________
_नन्दिनी
सर्वभूतानां - सर्वेषां स्थावरजङ्गमानाम्
बीजं - कारणम् ( व्यञ्जकत्वात् बीजमिव बीजं) , अङ्कुरोत्पादनसामर्थ्यम् ( “आकाशाद्वायुः " इति श्रुतेः)
सनातनं - नित्यम् , एकम् , अव्याकृतरूपं सर्वबीजम् ( अव्याकृतं मदभिन्नमेव ) , सर्वस्मात् प्राक्तनं , स्वयं निष्कारणम्
तत्र प्रमाणाः “सा काष्ठा सा परागतिः” ( कारणान्तरं नास्ति) ।
“न तस्य कश्चिज्जनिता” (सर्वस्य अपि आदिकारणम्), “विश्वस्मादिन्द्र उत्तरः” (अहमेव सर्वस्मात् उत्तरः)
बुद्धिः - बुध्यते आत्मा अनात्मा च इति बुद्धिः , प्रज्ञा
बुद्धिमतां - तद्वतां अहं बुद्धिरूपं, कारणम्
मयि बुद्ध्यात्मके ते प्रोताःसन्तः, मयि तिष्ठन्ति मदात्मना।
तेजः - पराभिभवनसामर्थ्यम् , परेषां अप्रधृष्यत्वम्
तद्वतामहं तेजोरूपं कारणम्।
In brief,
Know Me as the eternal seed- power in all beings.
I am the intellect of the intllectuals
I am the splendour of the splendourous.
……
Seed-power = बीजं , प्ररोहकारणम्
cause of germination
Intellect = विवेकशक्तिः
discrinative power of mind
____________________________
బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనమ్,
బుద్ధిర్బుద్ధిమతామస్మి తేజస్తేజస్వినామహమ్.
____________________________
నన్దిని
బీజం - అన్ని స్థావర జంగమ భూతాలకూ కారణము
సనాతనం - నిత్యము , అన్ని కార్యాలలోనూ అనుస్యూతము
మాం విద్ధి - నా విభూతిని తెలుసుకో .
అదేవిధంగా
బుద్ధిః - తత్త్వవివేచన రూపమైన ప్రజ్ఞ కలవారి బుద్ధిని నేనే, వివేకం లేకపోతే పశువు మొదలైన వాటికీ, వీనికీ భేదం ఏమీ ఉండదు కనుక ‘ज्ञानेन हीनः पशुभिः समानः ’ అని సనత్సుజాత వచనం కూడా.
ఇతరులను ఓడించగలిగిన తేజస్వుల తేజః సామర్థ్యాన్ని నేనే.
“ప్రాణులన్నీ వాటివాటి బీజాలలో నిక్షిప్తమై ఉంటాయి, నీలో కాదు " అని అనుకుంటే అలా కాదని ‘బీజం మాం…’ అని భగవంతుడు వివరిస్తున్నాడు.
आकाशाद्वायुः वायोरग्निः ఇత్యాది వాక్యాలవల్ల - పూర్వ పూర్వములు కారణములు, ఉత్తరోత్తరములు కార్యములు అని శ్రుతి చెప్పుతూ ఉన్నది కదా, (దాని వల్ల ఆయా కార్యాలు వాటి వాటి కారణాలలో అంతర్లీనంగా ఉన్నట్లు విదితమవుతుంది . చాలా చిన్న మఱ్ఱి విత్తనంలో ఎంతో పెద్ద మఱ్టి చెట్టు అంతర్నిహితమై ఉన్నట్లు).
మరి జగత్తంతా నీలో ఉన్నట్లు అనుకొనుట ఎట్లా అంటే आत्मन आकाशस्संभूतः అని ఈశ్వరుని నుండియే ఆ ఆకాశం వచ్చినట్లు సంభూతిశ్రుతి ఉన్నది.
కనుక సర్వజగదుత్పత్తికీ ప్రకృష్టకారణం తానేనని बीजं मां …అని చెపుతున్నాడు. భూతాలన్నిటికీ కారణం ఉన్నట్టే మరి నీకు కారణమో? అంటే, భగవంతునికి వేరే కారణమేమీ ఉండనక్కర లేదు- కారణాన్తర అవసరం లేదు; అనవస్థాదోషమేమీ ఉండదు. सा काष्ठा सा परागतिः, न तस्य कश्चिज्जनिता అని శ్రుతి చెప్పుటవల్ల భగవంతునికి మరొక కారణం లేదు.
సనాతనః - అన్నిటికీ ప్రాక్తనము, స్వయంగా నిష్కారణము అని అర్థం. ఉత్తరోత్తరంగా అన్ని కార్యాలలో అనుస్యూతము, అదే బీజము. బీజం అంటే అంకురోత్పాదన సామర్థ్యం గల విత్తనము .
సనా అంటే శాశ్వతం.
బుద్ధిః - बुद्ध्यते आत्मा नात्माच धर्माधर्मादिरप्यवगम्यते अनयेति बुद्धिः , బుద్ధి రూపంలో వారు నాలో ఉంటారు అని అర్థం - ఇతిభావః…mvr
11
____________________________
बलं बलवतां चाहं कामरागविवर्जितम् ,
धर्माऽविरुद्धो भूतेषु कामोऽस्मि भरतर्षभ! ।
_____________________________________
नन्दिनी
कामरागविवर्जितं …
कामः - अप्राप्ते वस्तुनि अभिलाषः
रागः - अभिलषिते अर्थे प्राप्ते अपि, क्षयकारणे सत्यपि “न क्षीयतां” इति एवंवृत्तिविशेषः
ताभ्यां विशेषेण वर्जितम्
बलवतां - पुरुषार्थवतां शौर्यम् , कामरागविवर्जितमेव बलं मद्रूपत्वेन मद्रूपत्वेन ध्येयम् ( न तु संसारिणां कामरागकारणं बलम् ) । निःसङ्गत्वेन धर्माचरणरूपम् ।
धर्मः - वेदविहितः सदाचाररूपः, ( वेदप्रतिपाद्यः प्रयोजनवत् धर्मः इति मीमांसा)
तेन
अविरुद्धः - अप्रतिषिद्धः
यः
भूतेषु - प्राणिषु
कामः - देहगेहादि विषयः अभिलाषः
सः , स्व आश्रमधर्मस्य साधकः ( नैव बाधकः) अहमस्मि ।
भरतर्षभ - संबुद्धिः भारतानां मध्ये श्रेष्ठः, त्वं त्यक्तुं नार्हसि इति सूचयन्
_____________________________________
బలం బలవతాంచాహం కామరాగవివర్జితమ్,
ధర్మావిరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ!.
____________________________
In brief,
I also am the might of the mighty - devoid of attachment and appetite.
I am the appetite in beings which is not opposed to Dharma, righteousness.
The might = बलं, सामर्थ्यं, ओजः
a)Appetite = कामः craving for objects that are not presented
b)Attachment = रागः is the pleasure felt once the object is available
…..
The might that is devoid of the both
a) काम and b) राग is what I am.
It is just sufficient for the sustenance!
…………
One more characteristic of the correct appetite is that which is unopposed to righteousness,( ie to the content of Shastras) - I am that appetite!
నన్దిని
బలవంతులలోని కామ/ రాగములు లేని బలాన్ని నేను!
ప్రాణులలోని ధర్మానికి విరుద్ధంకాని కామాన్ని నేను.
అహమ్ - నేను
బలవతామ్ - బలవంతులలోని
కామ , రాగ వివర్జితమ్ - కామం అంటే అలభ్య విషయం మీది తృష్ణ ;
రాగం అంటే లభ్య విషయాలమీది ఆసక్తి. ఇవి రెండూ లేని
కామః అస్మి - అభిలాషను నేను.
కామము = కోరిక నెరవేరనప్పుడు, ప్రాప్తి కారణం లేకున్నా - “ఈ వస్తువు నాది అగుగాక” - అనే అభిలాష .
రాగము = అభిలషిత వస్తువు నశించేదే ఐనా , “ఈ వస్తువు ఎల్లప్పటికీ ఉండుగాక, క్షీణించకుండుగాక” అనే రజోగుణాత్మక చిత్తప్రవృత్తి (రంజనాత్మకము).
బలం = పైన చెప్పినట్టి కామం మరియు రాగం లేని, రజస్తమో గుణాలు లేని, దేహేన్ద్రియ ధారణ సామర్థ్యం స్వధర్మానుష్ఠాన రూపమైన సత్త్వము.
च ‘చ’ అనేది - तु ‘తు’ అనే శబ్దార్థంలో వాడింది. అంటే, సంసారుల కామరాగాలకు యేది కారణమో
సంసార పరాఙ్ముఖుల విషయంలో అదే “నా వైపు” ప్రసరించుట వల్ల
బలమౌతుంది.
ధర్మం = ధర్మ శాస్త్రము, వేదవిహితమైన సదాచారము.
భూతేషు = ప్రాణులలో
కామః = శాస్త్ర సంమతమైన శారీరక వాంఛ, సంతానమందలి అభిలాష, డబ్బు మొదలైన వాటి మీది అభిలాష.
మరి, काममय एवायं पुरुषः అని శ్రుతి చెప్పింది కదా అంటే -
శాస్త్రం అనుమతించిన కుటుంబం పైని అభిలాషను నేనే.
భరతర్షభ = ( భరత + ఋషభ) , అనుట లోని స్వారస్యం ఏమిటి?
భరతైః = శ్రేష్ఠులైన భారతీయుల చేత,
సేవితం = యుద్ధాత్మక ధర్మసాధనము- స్వధర్మంతో శత్రువులను జయించుట భారతీయుల శ్రేష్ఠత్వము. దానిని విడిచిపెట్టుట తగదని సూచన, ఇతిభావః…mvr
12
_____________________________________
ये चैव सात्त्विका भावा राजसास्तामशाश्च ये,
मत्त एवेति तान्विद्धि नत्वहं तेषु ते मयि ।
____________________________
नन्दिनी
न केवलं रसादिधर्मप्रेरकः किं नाम अवादि सर्वप्रेरकश्च …
ये च भावाः = पदार्थाः अथवा चित्तपरिणामाः
ये च सात्त्विकाः - शम , दमादयः
ये च राजसाः - हर्ष, दर्प आदयः
ये च तामसाः - शोक , मोहादयः
( जडवर्गाः)
अविद्याकर्मादिवशात् जायन्ते ।
तान् सर्वान्
मत्तः एव - मदीयप्रकृतिगुणकार्यत्वात् जातान्
विद्धि - जानीहि।
न तु अहं तेषु - तेषु अहं न वर्ते । अहं तेभ्यो भिन्नः
ते मयि - ते तु मदधीनाः सन्तः मयि वर्तन्ते। ते मत्तः पृथक् न सन्ति।
In brief,
All the objects constituted by Sattva, Rajasa and Taamasa (as told in the 14th Adhyaya) and generated by the forces of Karma of the creatures are born of Me alone.
I am not present in them as transmigrating Jivas even though the they are born of Me .
They are subject to Me on the contrary.
वसतीवरी why discuss so many things? I am the substrate for every thing…
ఎన్నని చెప్పేది? నేనే అన్నింటికీ మూలకారణం…
__________________________
యేచైవ సాత్త్వికా భావా రాజసాస్తామసాశ్చ యే,
మత్త ఏవేతి తాన్విద్ధి నత్వహం తేషు తే మయి.
__________________________
నన్దిని
ప్రపంచంలోని కొన్ని పదార్థాలు సత్త్వగుణం వల్ల పుట్టుతాయి,
మరికొన్ని పదార్థాలు రజోగుణం నుండి జన్మిస్తాయి,
ఇంకా కొన్ని పదార్థాలు తమోగుణం నుంచి ఉద్భవిస్తాయి .
మొత్తమ్మీద ఇవన్నీ నాయందే, నానుండియే పుట్టుతున్నాయి.
నేను ఆ గుణాల అధీనంలో లేను, ఆ గుణాలన్నీ నా అధీనంలో ఉన్నాయి!
సాత్త్వికాః యే చ భావాః - సత్త్వగుణం నుంచి యే పదార్థాలు పుట్టునో ( శమ దమాదులు)
రాజసాః యే చ - రజోగుణం నుంచి యేవి పుట్టుతున్నవో ( హర్షం, గర్వం మొదలైనవి )
తామసాః యే చ - తమోగుణం నుంచి యే పదార్థాలు ప్రాదుర్భవించునో ( శోకం, మోహం మొదలైనవి )
తాన్ - వాటిని
మత్తః ఏవ ఇతి - నానుండి వచ్చినవేనని
విద్ధి - తెలుసుకో.
…….
అహం తు - నేను మాత్రం
తేషు న - వాటి అధీనంలో లేను.
……
తే మయి - ఆ పదార్థాలు నా అధీనంలోనే ఉన్నాయి.
చిత్త పరిణామాలైన
1.శమ దమాదులు అనగా బహిరిన్ద్రియ అన్తరిన్ద్రియ నిగ్రహాలనే సాత్త్విక గుణాలూ,
-
హర్ష శోకాది రజోగుణాలూ,
-
శోక మోహాది తమో గుణాలూ
ఇవన్నీ నానుండియే ఉద్భవించినవి.
ఎందుకు కొందరికి సాత్త్విక గుణాలూ, మరి కొందరికి ఇతరేతర
గుణాలూ కలుగుతున్నాయి? అంటే, అనాదిగా వస్తున్న స్వ కర్మల వల్ల.
హేతుబద్ధంగా చూస్తే, కార్యంలో కారణం ఉంటుంది కనుక, భగవంతుడు ఆయా చిత్తవృత్తులలో ఉన్నట్లే కదా అన్నట్లయితే न तु अहं న తు అహం అని జవాబు.
तु ‘తు’ శబ్దం వైలక్షణ్యాన్ని సూచించుటకై వాడినది. ( అవి నానుండియే పుట్టినట్లు అనిపించినా, నేను వాటిలో ఉండను - అనగా జీవుడు మూడు గుణాలకూ లోబడి ఉన్నట్లుగా , నేను గుణాలకు అధీనుడను కాను. గుణాలే నాలో మరియు నా అధీనంలో ఉంటాయి. )
అథ వా
సాత్త్వికులైన దేవతలు,
రాజసులైన మనుష్యులు,
తామసములైన పశువులూ నానుండియే వచ్చినట్లు కనబడినా నేను వాటియందు ఉండను- )
రామకృష్ణాద్యవతారాలలో లీలార్థమై మనుష్యులలో కలిసిపోయినట్లే కనబడినా , ఆ మనుష్యాదులకు సజాతీయుణ్ణి కాను. ఇది ఎలా సంభవమవుతుంది ? అంటే, अजहद्गुणशक्तित्वात् అని జవాబు.
लक्षणा - లక్షణ
मुख्यार्थबाधे तद्योगे रूढितो अथ प्रयोजनात् ,
अन्योर्थो लक्ष्यते यत् सा लक्षणारोपितक्रिया అసలు అర్థాన్ని పక్కన పెట్టి, వేరే అర్థంలో వాడుట.
………….
जहत् लक्षणा జహల్లక్షణ
గంగాయాం ఘోషః = గంగలో గొల్ల పల్లె ( గంగ ఒడ్డున గొల్ల పల్లె) అనేది అనుస్యూతంగా చెపుతున్న ఉదాహరణ. ఇక్కడ గంగా శబ్దం తన అసలు అర్థం కోలుపోయి గంగా ‘తటం’ / ఒడ్డు అనే అర్థాన్ని సంతరించుకున్నది .
…………
अजहल्लक्षणा అజహల్లక్షణ
ఇక్కడ అసలు అర్ధం చెరిగిపోదు.
कुंताः प्रविशन्ति ఆయుధాలు వస్తున్నాయి ( ఆయుధధారులు వస్తున్నారు)అనేది తరతరాలుగా చెపుతున్న ఉదాహరణ.
कुंतधारिणः पुरुषाः प्रविशन्ति అని ఆకాంక్షాపూరణం కోసం తిప్పి తిప్పి అర్థం చేసుకోవలె.
అందుకే, చేతనాత్మక, అచేతనాత్మక జగత్తు అంతా నానుండియే పుట్టినట్లు , నాలోనే ఉన్నట్లు, నాయందే పర్యవసించినట్లూ అనిపిస్తుంది -
रज्जौ सर्पात्मना यद्वत् कल्पिता अपि तद्भ्रमैः తాడు పాముగా కనిపించినట్లు/ తాడు
పై లేనట్టి పాము కనబడినట్లు -
కారణావస్థలోనైనా , కార్యావస్థలోనైనా కారణంగా, ఆశ్రయంగా, స్వతంత్రత్వంతో నేను ఉంటాను.
నేను కాకుండా ఇంకో వస్తువు యేదీ కూడా ఎక్కువ గుణాలతో, లేదా ఎక్కువ శక్తులతో లేదు.
శ్రుతి ప్రమాణాలు -
सर्वं खल्विदं ब्रह्म
एकमेवाद्वितीयं ब्रह्म
नेह नानास्ति किञ्चन,
నేను చిత్తవృత్తులకు అతీతుడను అని చెప్పుట ఎందుకు?
विक्रियत्व
दूष्यत्व ప్రసక్తులు ఆత్మకు లేవని శ్రుతి చెపుతున్నది కనుక, ఇతిభావః…mvr
13
_____________________________________
त्रिभिर्गुणमयैर्भावैरेभिः सर्वमिदं जगत् ।
मोहितं नाभिजानाति मामेभ्यःपरमव्ययम् ॥
_____________________________________
नन्दिनी
त्वदात्मकस्य जगतः कुतः संसारित्वम् ?…
अयं जनः त्वां कुतः न जानाति??
एभिः - प्रागुक्तैः
त्रिभिः - त्रिविधैः
गुणमयैः - कामलोभादिभिः गुणविकारैः
भावैः - स्वभावैः
सर्वं इदं जगत् - प्राणिजातम्
मोहितं - आच्छादितज्ञानं सत्
मां - प्रत्यग्रूपं परंब्रह्म
न अभिजानाति - न साक्षात्करोति स्व-अभिन्नत्वेन
एभ्यः - गुणमयभावेभ्यः
परं - विलक्षणम्
अव्ययं - व्ययरहितं,
सर्वविक्रियाशून्यम्।
अहो दौर्भाग्यं इति अनुक्रोशं प्रदर्शयति भगवान्।
Bhagavan is evincing His pity for the world that fails to know Him.
He tells us the cause of the world’s अज्ञान, ignorance -
In brief ,
The world fails to recognize Me as the reality due to the fact that the world is deluded because of the constituents of Prakruti, the Nature.
‘Deluded’ is मोहितं meaning deprived of the power to discriminate - discriminate between Atma and Anaatma, the Soul and non-Soul.
I am immutable ie devoid of states like birth and death.
____________________________
త్రిభిర్గుణమయైర్భావైరేభిః సర్వమిదం జగత్,
మోహితం నాభిజానాతి మామేభ్యః పరమవ్యయమ్.
____________________________
నన్దిని
वसतीवरी
పదార్థాలన్నీ నానుండియే పుట్టి , నాలోనే ఉన్నాయని స్పష్టంగా తెలుస్తున్నా-
భగవంతుణ్ణి తెలుసుకోలేక పోతున్న జగత్తు పై జాలితో,
జగత్తు యొక్క యీ అజ్ఞానానికి కారణం ఏమిటో చెపుతున్నాడు-
జగత్తులో వున్న పదార్ధాలన్నీ మూడు విధాలైన భావాలచేత మోహింపబడినవై , వివేకం పోగొట్టుకొని -
ఈ భావాలన్నిటికంటే విలక్షణుడనై , భావవికారాలు లేని నన్ను - గుర్తు పట్టుట లేదు.
ఏభిః - ఈ
త్రిభిః - మూడు రకాల
గుణమయైః - గుణాల వికారాలైన
భావైః - భావాలచేత
మోహితమ్ - మోహంచెంది
……
ఏభ్యః పరః - వీటికి అతీతుడనైన
అవ్యయమ్ - భావవికారాలు లేని
మామ్ - నన్ను
…….
న అభిజానాతి - గుర్తించుట లేదు!
సర్వేశ్వరుడవూ, సర్వనియన్తవూ , సర్వకారణుడవూ , దోషరహితునివీ ( నిర్దోషం హి సమం బ్రహ్మ) , స్వతన్త్రునివీ అయిన నిన్ను - భగవంతునివని ఎందుకు గుర్తించుట లేదు?
గుర్తించితే, ఇంకా ఎందుకు సంసారులు గానే ఉండిపోతున్నారు ?? అనే ప్రశ్నలకు భగవంతుడు ఇలా జవాబు చెపుతున్నాడు.
జీవజాతమంతా సత్త్వ రజస్తమో గుణాలచేత మోహితమై ఉన్నది - (వాటి జ్ఞానం ఆచ్ఛాదితమై ఉన్నది. ) , అందుకే, ‘అన్నిటికీ ప్రవర్తకుడైన ఈశ్వరుడనే వాడున్నాడు’ అనే పరోక్షజ్ఞానమే తప్ప - ‘సాక్షాత్ పరబ్రహ్మయే వాసుదేవుడుగా భక్తుల హితానికై అవతరించి ఉన్నాన’ని నన్ను తెలుసుకోలేకపోతున్నారు.
అదేమిటి? నిన్ను చూస్తూనే ఉన్నారు కదా, అంటే త్రిగుణమయుడుగా మాత్రమే తెలుసుకుంటున్నారు గానీ
త్రిగుణాలకు అతీతుడుగా తెలుసుకొనుట లేదు.
అసలు, జగత్తే నీ ఆత్మ అయినప్పుడు, జగత్తుకు ( జీవులకు) సంసారిత్వం ఎలా వచ్చింది? అంటే
ఈ త్రిగుణాల వికారాలే భావాలుగా ద్యోతకము అయి కల్పన చేయబడినదే వైవిధ్యం కలిగిన సంసారం - ఆ సంసారంలో సంసరించువాడు సంసారి - ఈ సంసారి యొక్క దౌర్భాగ్యాన్ని గమనించి అనుక్రోశించే వాడే భగవంతుడు.
మోహానికి కారణం ఏమిటి? అంటే, ‘ఇన్ద్రియాభ్యామజయ్యాభ్యాం ద్వాభ్యామేవ హతం జగత్,
అహో ఉపస్థాజిహ్వాభ్యాం బ్రహ్మాది మశకావధి’.
ఇన్ద్రియాలను జయించుట చాలా కష్టం. భాగవతం ‘జితం సర్వం జితే రసే’ అని నాలుకను జయిస్తే విశ్వాన్నే జయించినదానితో సమానమని చెప్పింది. అనాటమీ ప్రకారం కూడా నాలుక అనే ఒక్క అవయవానికి ఎన్నో నాడులు ఉన్నాయి.
ఇటువంటి ఇన్ద్రియాలతో, మూడు గుణాల ( పగ్గాల ) అదుపులో ఉండుట వల్ల- “నాభిజానాతి” - తమకు అభిన్నంగా సాక్షాత్కరించుకొనలేరు.
నాభిజానాతి - ప్రాతిభాసిక సత్యమైన( లేని) వెండి కోసం పరుగులు తీసేవారు ముత్యపుచిప్పను ( పారమార్ధిక సత్యమును) ఎప్పటికీ చూడలేరు.
సత్తా త్రైవిధ్యం -
సత్యం మూడు రకాలు .
-
వ్యావహారిక సత్త , empirical reality, ( మనచుట్టూ ఉన్న ప్రపంచంలోని సంఘటనలు the world of phenomena, in the universe in which we live)
-
ప్రాతిభాసిక సత్త , apparent reality ( ఉదాహరణ రజ్జుసర్పభ్రాంతి, శుక్తి రజత భ్రాంతి, స్వప్న విషయ సత్యత్వము
eg rope-serpent, nacre- silver, dream contents)
- పారమార్ధిక సత్త , absolute reality , బ్రహ్మ జ్ఞానప్రాప్తి Brahma realization, ఆత్మ జ్ఞానం Self knowledge.
బ్రహ్మాత్మైక్యమే అద్వైత సత్యము
The Real which is Brahma- Atma is non-dual.
మహావాక్యావబోధతో కలిగే పరమార్థజ్ఞానము వ్యావహారిక, ప్రాతిభాసికములకు ఆధారము. This is the basic reality of the Vyavaharika and Pratibhaska knowledges which are superimpositions thereon at different levels.)ఇతిభావః…mvr
14
_____________________________________
दैवीह्येषा गुणमयी मम माया दुरत्यया ।
मामेव ये प्रपद्यन्ते मायामेतां तरन्ति ते ॥
_____________________________________
नन्दिनी
दैवी - सृष्ट्यादिरूपक्रीडाविशिष्टस्य देवस्य
को देवः ?
मम - मदीया , मायाविनः
एषा - प्रमाणप्रमिता
गुणमयी - सत्त्व रजस्तमो गुणात्मिका
माया - दुर्गा , मोहिका
दुरत्यया - दुस्तरा
हि - प्रसिद्धत्वसूचकम्
तथापि
ये मामेव - एवकारेण अव्यभिचारिण्या भक्त्या
प्रपद्यन्ते - भजन्ति
ते
मायामेतां - दुस्तरामपि
तरन्ति - ततः मां जानन्ति।
In brief,
This divine delusive power of Mine is difficult to cross over. Those surrendering to Me pass beyond this Maya.
Divine Maya = maya pertaining to Me.
Cross over deluding maya = getting liberated.
నన్దిని
वसतीवरी
ఇంతవరకూ భగవంతుని సత్త్వ, రజస్, తమో గుణాలతో నిండిన మాయను గురించి చెప్పి, ఇకపై ఆ మాయను జయించుట ఎలాగో చెపుతున్నాడు.
___________________________
దైవీహ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయా ।
మామేవ యే ప్రపద్యన్తే మాయామేతాం తరన్తి తే ॥
_____________________________________
దైవానికి సంబంధించిన , త్రిగుణమయమైన యీ నా మాయను దాటుట చాలా కష్టము.
మాయకలవాడు మాయావి- అట్టి మాయావినైన నన్ను మాత్రమే తమ ఆత్మగా కలవారు మాయను తరిస్తారు.
దైవీ - పరమేశ్వర సంబంధి అయిన
ఏషా మాయా - యీ మాయ
దురత్యయా - ఎంతో కష్టంతో గానీ జయించుటకు శక్యం కాని (అత్యయః = అతిక్రమించుట)
యే - ఎవరు
మామేవ - నన్నే
ప్రపద్యన్తే - పొందుతారో
……
తే - వారు
ఏతాం మాయామ్ - ఈ మాయను
తరన్తి - దాటుతారు.
दैवी - అలౌకికీ, అత్యద్భుతమైన
गुणमयी - సత్త్వ రజస్తమో గుణాత్మిక ఐన
मम माया - పరమేశ్వర శక్తి
दुरत्यया - దుస్తరమైనప్పటికీ
मामेव - ఏవకారంతో అవ్యభిచారిణి ఐన భక్తివలన
प्रपद्यन्ते - ఎవరు భజిస్తారో
मायामेतां तरन्ति - దుస్తరమైనప్పటికీ తరిస్తారు, నన్ను తెలుసుకుంటారు.
एकोदेवः सर्वभूतेषु गूढः सर्वव्यापी सर्वभूतान्तरात्मा । कर्माध्यक्षः सर्वभूताधिवासः साक्षी चेताः केवलो निर्गुणश्च అని శ్రుతి ప్రతిపాదించిన ఈశ్వరునికి సర్వకార్యాలూ నిర్వర్తించే శక్తి “మాయ” అనేది వున్నది- मायांतु प्रकृतिं विद्यात् मायिनन्तु महेश्वरम् అనే శ్రుతి దీనికి ప్రమాణము.
दुरत्यया అనుటవల్ల ఈశ్వరుని అనుగ్రహం లేకుండా ఇతరోపాయ శత, సహస్రాలతోనైనా దుస్తరమని అర్థం.
हि అనేది నిశ్చయవాచకం.
ఐనప్పటికీ
వామన పురాణం చెప్పినవిధంగా భక్తులు ते धर्मराजभवनं न विशन्ति धीराः అని ఈశ్వరుడు భక్తిగమ్యుడు.
జ్ఞానులకు मम అనగా మాయావినైన నా శక్తి- తత్త్వప్రతిభాస ప్రతిబంధంతో అతత్త్వప్రతిభాసహేతువుగా, ఆవరణ శక్తీ + విక్షేపశక్తీ కలిగిన అధ్యస్తమైన అనాదియైన అవిద్య - శుద్ధ చైతన్యంలో
బింబస్థానీయుడైన పరమేశ్వరత్వం
ప్రతిబింబస్థానీయుడైన జీవత్వంగా కనబడుతుంది.
ఇదే విషయం…
సాక్ష్యభిప్రాయంతో ‘దైవీ’ అనీ,
బింబేశ్వరాభిప్రాయంతో ‘మమ’ అనీ భగవంతుడు చెపుతున్నాడు.
భాగవతం ఇదే విషయాన్ని - ప్రతిబింబం అందంగా ఉండవలెను అంటే బింబాన్ని అలంకరించుమని, స్వరూపం తోనే పరిపూర్ణుడైన ప్రభువు పూజా నైవేద్యాలు ఆశించడనీ , భక్తుల హితం కోసం మాత్రమే వాటిని అంగీకరిస్తాడనీ
(नैवात्मनः प्रभुरयं निजलाभपूर्णो मानं जनादविदुषः करुणो वृणीते , यद्यज्जनो भगवते विदधीत मानं
तच्चात्मने प्रतिमुखस्य यथा मुखश्रीः)
ప్రహ్లాద చరిత్రలో ఉగ్గడించింది ( 7.9.11).
मामेव ये प्रपद्यन्ते మామేవ యే ప్రపద్యన్తే అనుటలోని ఏవ కారం యేమి సూచిస్తున్నది? పరమాత్మకు మాత్రమే యెవరు ప్రపన్నులవుతారో
(మాయా రహితుడైన పరమాత్మకు మాత్రమే యెవరు ప్రపన్నులవుతారో అని అర్థము.)
జీవేశ్వరులు మఱియు
మాయ / అవిద్యల గురించిన జ్ఞాతవ్య విషయములు -
- మాయ అనాది , అనిర్వచనీయము. మాయలోని చైతన్య ప్రతిబింబము ‘ఈశ్వరుడు’.
మాయకు ఆవరణ, విక్షేప శక్తులుఉన్నాయి. ఆ శక్తులతో అనన్త అవిద్యలు కలుగుతాయి. అట్టి అనన్త అవిద్యా ప్రదేశములలో ఏర్పడిన చైతన్య ప్రతిబింబములు ‘జీవులు’.
- మూలప్రకృతికి రెండు రూపములు …
a) శుద్ధ సత్త్వ ప్రధానమైన మాయ ఒక రూపము;
b) మలిన సత్త్వప్రధానమైన అవిద్య మఱొక రూపము.
మాయా ప్రతిబింబము ఈశ్వరుడు,
అవిద్యా ప్రతిబింబము జీవుడు.
- మూల ప్రకృతి ఒక్కటే…
విక్షేప ప్రధానమైన మాయ ఈశ్వరుని ఉపాధి ;
ఆవరణ ప్రధానమైన అవిద్య జీవోపాధి.
- బ్రహ్మము ఒక్కటే,
అవిద్యలో ప్రతిబింబించేది ఈశ్వరుడు! ;
అన్తఃకరణములో ప్రతిబింబించేది జీవుడు!! ( कार्योपाधिरयं जीवः, कारणोपाधिरीश्वरः అని శ్రుతి. )
_ చైతన్యము ఒక్కటియే అయినా a) అజ్ఞానోపాధికుడు ఈశ్వరుడు; b) అన్తఃకరణోపాధికుడు జీవుడు.
- అజ్ఞానము ఒక్కటే, ఐనా …
బింబస్థానీయుడు ఈశ్వరుడు;
అజ్ఞానగత చైతన్య ప్రతిబింబము జీవుడు. దీనికి మూలము विभेदजनकेऽज्ञाने नाशमात्यन्तिके गते
आत्मनो ब्रह्मणो भेदमनन्तं कः करिष्यति అనే స్మృతి.
ఇతిభావః…mvr
15
_____________________________________
न मां दुष्कृतिनो मूढाः प्रपद्यन्ते नराधमाः ,
मायया ఽपहृतज्ञाना आसुरं भावमाश्रिताः ।
_______________________________________
नन्दिनी
कस्मात् त्वामेव परमेश्वरं सर्वे न प्रपद्यन्ते ? इत्याकाङ्क्षायां आह भगवान् -
दुष्कृतयोगात् इति।
दुष्कृतिनः - दुष्टं, जननमरणादि दुःखप्रदं, काम्यलक्षणं कर्म ( क्रियत इति कर्म )
एषामस्ति ते दुष्कृतिनः ,
ते पापसंचयत्वात् मां न प्रपद्यन्ते = न भजन्ते ।
दुष्कृतिनः अपि चतुर्विधाः, दुष्कृततारतम्यात् …
१) मूढाः - भगवत्तत्त्वं ज्ञातुं अनर्हाः बुद्धि मान्द्यात्
२) नराधमाः - शास्त्रपठनं कर्तुं , श्रोतुं , ज्ञातुं अपि समर्थाः एव, परंतु भगवदाश्रयणे अश्रद्धधानाः
३) मायया अपहृतज्ञानाः - मयि असंभावना, विपरीतभावना जनिता माया, तया मायया अपहृतं नाशितं ज्ञानं येषां ते
४) आसुरंभावमाश्रिताः - ये मां, मद्भक्तांश्च द्विषन्ति! ( असुषु इन्द्रियेषु रता असुराः, तदीयं भावमाश्रिताः, अपि च )।
ते एते उत्तरोत्तरं पापबहुलाः।
Why don’t all surrender to Bhagavan when they can pass beyond Maya by just_ surrendering to Him ? The answer is
In brief,
Base, deluded, evil- doers don’t surrender to Me because of Maya. Their knowledge is robbed by Maya and they may even assume a demoniac attitude through violence, falsehood, deception etc.
__वसतीवरी భగవంతుణ్ణి పొందినవాళ్ళు ఈ మాయను తరించగలరూ అన్నట్లయితే అందరూ భగవంతుణ్ణే ఎందుకు ఆశ్రయించరు?అంటే జవాబు చెపుతున్నాడు
న మాం దుష్కృతినో మూఢాః ప్రపద్యన్తే నరాధమాః , మాయయాఽ పహృతజ్ఞానా ఆసురం భావమాశ్రితాః.
నన్దిని
దుష్కృతినః- పాపాత్ములు
మూఢాః- తెలివితేటలు లేనివారు
నరాధమాః - మనుష్యులలో తక్కువ స్థాయిలో అనుకూల పరిస్థితులలో ఉన్నవారు
మాయయా - మాయచేత
అపహృతజ్ఞానాః - దొంగిలించబడిన జ్ఞానం కలవారు
ఆసురం భావమ్ - అసురులు సురద్విషులు కాన లోకోపకారం చేసేవారికి అపకారం చేసేవారి ఆలోచనలను
ఆశ్రిత్య - పొంది
మామ్ - నన్ను
న ప్రపద్యన్తే - पद गतौ కనుక అనుసరించరు
పరమేశ్వరుడనైన నన్ను నాలుగు రకాల చెడు కర్మ కలవారు , దుష్కృతులు, ఆశ్రయించరు.
दुष्कृतिनः దుష్కృతినః - పాపంతో సహయోగం చేసి పాపం బాగా మూటగట్టుకున్నవారు,
ఈ మూటలు కట్టుకున్న వాళ్లు ఒకరికంటే మరొకరు బలంగా ఉండే ( उत्तरोत्तरं पापबहुलाः) నాలుగు సమూహాలవాళ్ళు ఇలా ఉన్నారు -
-
मूढाः మూఢాః - శాస్త్ర ప్రదిపాదితమే ఐనప్పటికీ- ఆ శాస్త్రం లో చెప్పబడింది కూడా చదువుకోలేక, బుద్ధిమాన్ద్యం వల్ల జ్ఞానం పొందే అర్హత లేనివారు , ఆహార మైథునాదులే సర్వస్వంగా భావించే వారు
-
नराधमाः నరాధమాః - శాస్త్రం ప్రతిపాదించిన భగవంతుని తత్త్వాన్ని విని, చదివి, తెలుసుకునేంతటి బుద్ధిమంతులే అయినా - తిండీ, బట్టా, లైంగిక సుఖమూ మొదలైన ప్రాకృత విషయాలలో సక్తులు , తగులుకున్నవారు
-
अपहृतज्ञानाः అపహృత జ్ఞానాః - మాయ వలన అపహరించబడిన జ్ఞానం కలవారు. వీరికి తెలివితేటలు ఉన్నాయి, శాస్త్ర జ్ఞానమూ ఉన్నది, కానీ పురాకృత పాప ప్రాబల్యం వల్ల ఏర్పడిన అసంభావన_, విపరీత భావన__ లతో అసంబద్ధం, వ్యతిరేకం ఐన ఆలోచనలతో జ్ఞానం అపహరించబడింది , జ్ఞానం నశించిపోయింది ( ‘చదువవేస్తే ఉన్న మతి పోయింది’)
…… …… …… ……
_असंभावना = बलवन्निषेधकोटिकः संशयः , సన్దేహము, భగవంతుడు ఉన్నాడో లేడో మొ.
__विपरीतभावना = अतस्मिंस्तद्बुद्धिः , దేహాన్నే ఆత్మను గా భావించుట
……. …….. ……. ……
- आसुरं भावमाश्रिताः ఆసురం భావమాశ్రితాః- వీరికి తెలివితేటలు ఉన్నాయి, శాస్త్ర విజ్ఞానం కూడా ఉన్నది, కాపట్యం కూడా లేదు- అయితే వీరు బుద్ధిపూర్వకంగా భగవత్ తత్త్వాన్నీ, భక్తులనూ ద్వేషిస్తూ ఉంటారు. ’ క్రూరుండెన్ని సుధీగుణంబు దురితారూఢమ్ము జేయుంగదా’ అని భర్తృహరి సుభాషితాన్ని తెలుగు చేసిన ఏనుగు లక్ష్మణ కవి వాపోయినట్లు ఉంటారు.
పాపబాహుళ్యంవల్ల పైన చెప్పిన విధంగా దుష్కృతులు - పాపులు - నాలుగు రకాలు. ఈ విధమైన పాపులు నన్ను ఆశ్రయించలేరు. ఇతిభావః …mvr
16
चतुर्विधा भजन्ते मां जनाः सुकृतिनोर्जुन ,
आर्तो जिज्ञासु रर्थार्थी ज्ञानीच भरतर्षभ !
____________________________
नन्दिनी
के पुनः त्वां प्रतिपद्यन्ते ?
सुकृतिनस्तु मां भजन्ति।
सुकृततारतम्येन चातुर्विध्यमाह भगवान् -
सुकृतिनः - पूर्वजन्मसुकृतपुण्यसञ्चयः विद्यते येषु ते जनाः
मां भजन्ते - ते एव भजन्ते , न अन्ये
अर्जुन ! - इति संबोधयन् सुकृतकर्मणा सुकृतकर्मणां स्वच्छतां आपादयति।
चतुर्विधाः - ते च त्रयः सकामाः , एको अकामः, इत्येवं चतुर्विधाः
तत्र
१ आर्तः - शत्रु आधि, व्याधि आदि आपदाग्रस्तः ( सकामः ) , यथा वस्त्राकर्षणसमये द्रौपदी, ग्राहगृहीतो गजेन्द्रः
२ जिज्ञासुः - तत्त्वज्ञानार्थी मुमुक्षुः ( सकामः) , यथा विदेह, रहूगण, यदु आदिः
३ अर्थार्थी - भोगसाधनभूत अर्थलिप्सुः ( सकामः) , यथा ध्रुवः, सुग्रीवः , विभीषणः ,
४ ज्ञानी - आत्म- परमात्म तत्त्व विवेकज्ञः ( निष्कामः, एकान्ती), यथा प्रह्लाद, नारदादिः
च - यस्य कस्यापि सकामी अपि पुनः ज्ञानी अपि भवतीति।
भरतर्षभ - त्वं जिज्ञासुर्वा ज्ञानी वा इति मा शङ्किष्ठा इत्यर्थः।
In brief,
Men of righteous are of four
types resort to Me. They are the afflicted, knowledge-seeking,
wealth- seeking, and the ones with wisdom.
सुकृतिनः whose acts are righteous/ meritorious
____________________________
చతుర్విధా భజన్తే మాం జనాః సుకృతినోర్జున,
ఆర్తో జిజ్ఞాసురర్థార్థీ జ్ఞానీచ భరతర్షభ !
నన్దిని
वसतीवरी _దుష్కృతుల గుఱించి ,వారు ఎందుకు తనను ఆశ్రయించరో చెప్పిన భగవన్తుడు, ఇక సుకృతుల గుఱించి కూడా వివరిస్తున్నాడు __
ఆపదలలో ఉన్నవాడు, జ్ఞానం పొందే కోరిక కలవాడు, సంపదలు కావాలనుకునే వాడు, జ్ఞానం అంటే తత్త్వం తెలుసుకున్నవాడూ అనే నాలుగు రకాల పుణ్యాత్ములు నన్ను సేవిస్తారు.
భరత + ఋషభ - భారతీయులలో శ్రేష్ఠుడా!
ఆర్తః - కష్టాలలో ఉన్నవాడు
జిజ్ఞాసుః - జ్ఞానార్థి
అర్థ + అర్థీ - సంపత్తును కోరేవాడు
జ్ఞానీ చ - జ్ఞానం కలిగినవాడూ
…… …… …… …….
చతుర్విధాః - నాలుగు రకాల
సుకృతినః జనాః - పుణ్యాత్ములైన జనులు
మామ్ - నన్ను
భజన్తే - సేవించెదరు.
పుణ్యకర్మలు చేసి, శ్రద్ధాప్రేమలతో నన్ను సేవించేవారు నాలుగు విధాలని चतुर्विधा भजन्ते అని భగవన్తుడు చెపుతున్నాడు-
सुकृतिनः సుకృతినః- పూర్వజన్మలో చేసిన సుకృతసంచయం ఉన్నవారు, వారి సుకృతం లోని తరతమభేదాన్ని బట్టి
चतुर्विधाः చతుర్విధాః - నాలుగు విధాలు;
-
ఆర్తులు ….सकामाः
-
జిజ్ఞాసులు "
-
అర్థార్థులు "
-
జ్ఞానులు निष्कामाः
-
आर्ती ఆర్తీ - శత్రువు , వ్యాధి మొదలైన ఆపదలలో మునిగినవాడు , ఉదాహరణకు జరాసన్ధుని కారాగారంలో ఉన్న రాజసమూహం , ద్యూతసభలో వస్త్రాపహరణ సమయంలో ద్రౌపది, మొసలి నోట చిక్కిన గజేన్ద్రుడు ,
-
जिज्ञासुः జిజ్ఞాసుః -తత్త్వజ్ఞానార్థి ఐన ముముక్షువు
ఉదాహరణకు, రహూగణ ( భాగవతం పంచమ స్కంధం), ముచుకుంద,
విదేహ రాజులు
- अर्थार्थी అర్థార్థి - భోగాలు, ఐశ్వర్యం , పదభ్రష్టులై మళ్ళీ ఆ భోగాలు కాంక్షించేవాడు. ఉదాహరణకు ధ్రువ, సుగ్రీవ , విభీషణులు
‘चकारः’ ‘చ’ కారం - సకాములు సంఖ్యాత్మకంగా ఎక్కువగా ఉన్నా ఎక్కడనో ఒకచోట నిష్కాములు కూడా ఉండవచ్చును అని సూచన
- ज्ञानी జ్ఞానీ - సమ్యఙ్నిర్ణీత ఆత్మ పరమాత్మ తత్త్వవివేకం కలవాడు. ఇతడు నిష్కామ భక్తుడు. పరమప్రాప్యమని తెలుసుకొని నన్నే సేవిస్తాడు. ఉదాహరణకు, సనకాదులు, నారద , శుక, ప్రహ్లాద, భీష్మ, ఉద్ధవాదులు , ఇతిభావః…mvr
17
_____________________________________
तेषां ज्ञानी नित्ययुक्त एकभक्तिर्विशिष्यते,
प्रियो हि ज्ञानिनोऽत्यर्थमहं सच मम प्रियः।
_____________________________________
नन्दिनी
१५ तमे श्लोके दुष्कृतिनः मां न भजन्ते इति, १६ तमे श्लोके तु तद्विलक्षणाः सुकृतिनः मां भजन्ते इति प्रदर्शितम् ।
किं ते सर्वे सुकृतिनः निर्विशेषात् इति चेत् आह भगवान् , तेषां चातुर्विध्यं अस्त्येव -
चतुर्विधानामपि सुकृतित्वे नियते अपि तर तम भेदः अस्त्येव !
ज्ञानी - तत्त्वज्ञानवान्
विशिष्यते - उत्कृष्टः, अतिरिच्यते सर्वतः ( निष्कामतया, प्रेमाधिक्यात् )
कुतः?
नित्ययुक्तः - सदा समाहितचेताः ,
नित्ये = अविक्रिये, अक्षरे,
मायाविरहित परमात्मनि युक्तः = न तु अनित्यपरः
एकभक्तिः - एका =
द्वैविध्यनिर्मुक्ता,
द्रष्टा/ दृष्टं इति भेदः न
विद्यते, अन्तःकरणवृत्तिः एका एव,
एकस्मिन् भगवति एव
भक्तिः = स्वविषयीभूतवस्तु-आकारं
भजतीति भक्तिः, अनुरक्तिः यस्य
सः,
हि - यस्मात्
ज्ञानिनः अहं अत्यर्थं प्रियः
प्रियः - निरुपाधि प्रेमास्पदम्
अत्यर्थं - अत्यन्त-अतिशयेन
सः - स च ज्ञानी
मम - मम अपि , परमेश्वरस्य अपि
प्रियः - प्रेष्ठः, न तु अन्यः
हिः - “तदेतत् प्रेयः पुत्रात् प्रेयो वित्तात् प्रेयो अन्यस्मात् सर्वस्मात् अन्तरतरं यदयमात्मा " आदि श्रुतिप्रकाशनार्थः।
_वसतीवरी
Having told that all the four types of devotees are men of righteous acts, Bhagavan is going to say that He likes one category among the four much more__
तेषां ज्ञानी नित्ययुक्त एकभक्तिर्विषिष्यते प्रियो हि ज्ञानिनोत्यर्थ महं स च ममप्रियः
__In brief, The one who is ever integrated and devoted exclusively, excels; why because I am exceedingly dear to the knower and he is dear to Me**!**
__________________________
తేషాం జ్ఞానీ నిత్యయుక్త ఏకభక్తిర్విశిష్యతే ,
ప్రియో హి జ్ఞానినోత్యర్థ మహం స చ మమప్రియః__
నన్దిని
పూర్వశ్లోకంలో చెప్పిన ఆర్తి, జిజ్ఞాసువు, అర్థార్థి, జ్ఞాని అనే నలుగురిలో తురీయుడైన జ్ఞాని-
పరమాత్మ యందు మాత్రమే భక్తి కలిగి ఉంటాడు , ఎల్లప్పుడూ ఆత్మ యందే ఏకాగ్రచిత్తం కలిగి ఉంటాడు. కనుక ఇతడు విశిష్టుడు.
జ్ఞానికి నేను చాలా ఇష్టమైన వాణ్ణి; నాకు జ్ఞాని ఇష్టుడు!
तेषाम् తేషాం - వారిలో
नित्ययुक्तः నిత్యయుక్తః - ఎప్పుడూ ఆత్మ యందే ఏకాగ్రచిత్తం కలవాడు
एकभक्तिः ఏకభక్తిః - పరమాత్మ యందు మాత్రమే భక్తి కలిగిన
ज्ञानी विशिष्यते జ్ఞానీ విశిష్యతే - జ్ఞాని విశిష్టుడు.
……..
अहम् అహమ్ - నేను
ज्ञानिनः జ్ఞానినః - జ్ఞానికి
अत्यर्थं प्रियः అత్యర్థం ప్రియః - చాలా ఇష్టమైన వాణ్ణి.
……
सः च సః చ - ఆ జ్ఞాని కూడా
मम प्रियः మమ ప్రియః - నాకు ఇష్టుడు.
కార్యకారణ సంబంధాన్ని చెపుతున్నాడు -
పై నాలుగు రకాల భక్తులలోనూ
తత్త్వం తెలిసిన వాడు,
తత్త్వవిదుడు కనుక యుక్తుడు,
సేవించవలసింది మరొకటి లేదు కనుక ఏకభక్తి కలవాడు -
అందరికన్నా గొప్ప.
ఎందుకని గొప్ప?
నేను జ్ఞానికి ఆత్మను, ఆత్మ అన్నిటికన్నా ప్రియం కనుక నేను వానికి ప్రియుణ్ణి!
ఆ జ్ఞాని కూడా నాకు ప్రియుడు.
ఎందుకు ప్రియుడు?
వాసుదేవుడనైన నాకు ఆ జ్ఞాని కూడా ఆత్మయే కనుక!!
तेषां తేషాం - ఆ నాలుగు విధాల భక్తుల మధ్య
ज्ञानी జ్ఞానీ - తత్త్వజ్ఞానవంతుడు
विशिष्यते విశిష్యతే - సర్వోత్కృష్టుడు అగును.
कुतः ఎందుకంటే
नित्ययुक्तः నిత్యయుక్తః - చిత్తాన్ని నాయందు, భగవంతునిపై, ఉంచుకొని
एकभक्तिः ఏకభక్తిః - దేవాన్తర, సాధనాన్తర, ఫలాన్తర, సంబంధాన్తరములను విడిచి పెట్టి, సముడు గానీ అధికుడుగానీ లేని నన్నే ధ్యానాదులతో భజించే వాడు ఏకభక్తుడు.
ज्ञानिनः జ్ఞానినః - జ్ఞానులకు
अहं అహం - నేను
अत्यर्थं प्रियः అత్యర్థం ప్రియః - అనవధిక ప్రీతివిషయుడను.
సుకృతం యొక్క ఆధిక్యంచేత నిష్కామభక్తి కలిగి ప్రేమాధిక్యంవలన జ్ఞాని విశిష్టుడు.
विशिष्यते విశిష్యతే - సర్వోత్కృష్టుడగును
श्रुतय ऊचुः శ్రుతులు - ధ్యేయవస్తువుకు మాయా లేశం ఉండదు, ओमित्येवं ध्यायथ , अथ यो अन्यां देवतामुपास्ते అని స్వాభిన్న దేవతాన్తరోపాసన చేసేవారు పశుతుల్యులనీ,
तमेव धीरो विज्ञाय అని సర్వత్ర బ్రహ్మ దర్శకమైన ప్రజ్ఞాకరణంలోనూ,
तदेतत्प्रेयः पुत्रात् प्रेयो वित्तात् प्रेयो अन्यस्मात् सर्वस्मात् अन्तरतरं यदयमात्मा అనీ, आत्मनस्तु कामाय सर्वं प्रियं भवति అనీ-
జ్ఞానులకు అన్నిటికన్నా శ్రేష్ఠమైనది, ప్రియతమమైనది ఆత్మ యేనని చెప్పినవి. ఇతిభావః…mvr
18
_____________________________________
उदाराः सर्व एवैते ज्ञानीत्वात्मैव मे मतम् ,
आस्थिताः सहि युक्तात्मा मामेवानुत्तमां गतिम्
____________________________
नन्दिनी
उदारः -
उदियर्ति परकार्यं कर्तुमेतीत्युदारः, उत्कृष्टः, महान्तः, ( ते सर्वे मोक्षभागिनः एव )।
ज्ञानवान् अज्ञो वा भक्तः मम अप्रियः न भवति ।
ज्ञानिनः प्रियान्तरशून्याः ; अतः सोपि मम प्रीतिविषयः।
“यदेव विद्यया करोति श्रद्धयोपनिषदा तदेव वीर्यवत्तरं भवति " इति श्रुतेः। विद्यादिव्यतिरेकेणकृतमपि कर्म वीर्य ‘वत्’ भवत्येव। सकामा अपि श्रेष्ठा एव।
ज्ञानी तु - तु शब्दः सकामत्रय-अपेक्षया निष्कामत्वविशेषद्योतनार्थः।
आत्मैव - मनः एव, देहः वा
इति
मे - मम
मतं - संमतम्
हि - यस्मात्
सः युक्तात्मा - एकान्ती भक्तः, सदा मयि समाहित चित्तः
मां - भगवन्तम् / आत्मानमेव
अनुत्तमां - सर्वोत्कृष्टां
गतिं - गन्तव्यम्
आस्थितः - अङ्गीकृतवान्। ( न तु मद्भिन्नं किमपि फलं न मन्यते )
In brief,
All these four categories of devotees are noble;
तु , whereas , the knower is My very Self.
Why? Because he has resorted to Me alone, without a parallel goal.
All the Devotees are noble but the Knower is exceedingly dear.
This is My doctrine. The Knower seeks to ascend the level of Knowledge that अहं वासुदेवः , “I am pervading all the beings.”
ఉదారాఃసర్వ ఏవైతే జ్ఞానీత్వాత్మైవ మే మతమ్ ,
ఆస్థితాః సహి యుక్తాత్మా మామేవానుత్తమాం గతిమ్.
वसतीवरी ‘రాజుగారికి చిన్నభార్య అంటే ఇష్టం’ అంటే, మిగతా భార్య లంటే అయిష్టమని అర్థమేకదా అంటే;అలా కాదు.
అలాగే,
‘జ్ఞాని అంటే ఇష్టం’ అంటే , మిగతా వారు - ఆర్తుడు, జిజ్ఞాసువు, అర్థార్థీ - వాసుదేవునికి ఇష్టులు కారా అంటే, ఆవిధంగా అర్థం చేసుకోవద్దు- అని భగవన్తుడు చెపుతున్నాడు -
నన్దిని
వీళ్ళు అందరూ గొప్పవారే. ఐతే, జ్ఞాని నా ఆత్మయే అని నా అభిప్రాయం.
ఎందుకూ అంటే, జ్ఞాని ఏకాగ్రత గల చిత్తంతో, నేనే అత్యుత్తమ గతి అని నమ్మినవాడు .
एते सर्वे ఏతే సర్వే - వీళ్ళు అందరూ
उदाराः एव ఉదారాః ఏవ- గొప్పవారే ,
तु తు - ఐతే ,
ज्ञानी జ్ఞానీ - జ్ఞాని
मे आत्मा एव మే ఆత్మా ఏవ - నా ఆత్మయే నని
मतम् మతమ్ - నాదైన అభిప్రాయము.
………..
सः సః - అతను, జ్ఞాని
युक्तात्मा యుక్తాత్మా - ఏకాగ్రతతో
मामेव మామేవ- నన్నే
अनुत्तमां गतिम् అనుత్తమాం గతిమ్ - అన్నిటికన్నా గొప్ప గతిగా
आस्थितः हि ఆస్థితః హి- అవలంబించి ఉన్నాడు కదా!
జ్ఞానులు విశిష్టులు అంటే మిగతా మూడు విధాల భక్తులు అప్రియులూ, అధములూ అని భావించకుండా ( రాజుగారి చిన్న భార్య మంచిది అంటే పెద్ద భార్య మంచిది కాదు అని అర్థం చేసుకోనక్కఱ లేదు- न हि निन्दा न्यायः )
उदाराः ఆ త్రితయమూ కూడా ఉత్కృష్టులూ , వదాన్యులూ , జన్మాంతరాలలో ఎన్నో పుణ్యాలు చేసినవారూ మాత్రమే! ; అల్పపుణ్యం చేసినవారెవరూ నా భక్తులు కాలేరు సుమా! అని అర్థం.
శ్రుతి “यदेव विद्यया करोति श्रद्धयोपनिषदा तदेव वीर्यवत्तरं भवति” అనుచో तर శబ్దం వివక్షతో చెప్పినది , కనుక
విద్యాది వ్యతిరేకేణ చేసినది वीर्यवत्तरं కాకపోయినా … वीर्यवत् అయితే తప్పక అవుతుంది - జ్ఞానవ్యతిరేక భక్తియే కలవారైనప్పటికీ ఆర్త, జిజ్ఞాసు, అర్థార్థులు కూడా భగవన్తునికి ప్రియులే.
‘అత్యర్థం’ అనే విశేషణం వల్ల జ్ఞానులు ఎక్కువ ప్రియులని స్పష్టీకరణ.
हि శబ్దము , ఆదిత్రితయము సకామమనీ
తురీయము నిష్కామమనీ ద్యోతనం చేస్తున్నది.
अनुत्तमां సర్వోత్కృష్టమైన
गतिम् గన్తవ్యమును
आस्थितः అంగీకరించినాడు . నాకు భిన్నంగా మరే ఫలాన్నీ అపేక్షించడు అని అర్థం.
శాతపథ శ్రుతి “य एवं वेद अहं ब्रह्मास्मीति स इदं सर्वं भवति… “, సర్వాత్మకుడగును, అని చెప్పింది.
ఈ శ్లోకం ‘ఏక ప్రశంసయా ప్రాప్తేతర నిన్ద’ ను పరిహరించేది, ఇతిభావః …mvr
19
________________________________________
बहूनां जन्मनामन्ते ज्ञानवान्मां प्रपद्यते ,
वासुदेवः सर्वमिति स महात्मा सुदुर्लभः ।
_____________________________________
नन्दिनी
( ज्ञानस्य स्वरूपम् )
बहूनां जन्मनां - शुभाचारवतां, किञ्चित् किञ्चित् पुण्योपचयहेतूनां
अन्ते - चरमे जन्मनि
ज्ञानवान् - वासुदेवः सर्वमिति ज्ञानवान्
मां - परं ब्रह्म
प्रतिपद्यते - विदेहकैवल्यं प्राप्नोति।
अतः
स महात्मा - ब्रह्मात्मदृक्
सुदुर्लभः - अतिशयेन दुर्लभः।
In brief,
The man of knowledge reaches Me ,directly at the end of many births.
Reaching Me is through realizing Vasudeva is all ( Vasudeva = वासुश्चासौ देवश्च वासुदेवः Deva in whom all the worlds reside ).
Such a magnanimous soul is extremely rare.
At the end of many births
बहूनां जन्मनामन्ते , means ‘devoted to self-purification resulting in greater knowledge’ .
Exceedingly rare सुदुर्लभः , means such people realise that there is none like Him or exceeding Him.
Magnanimous महात्मा means the one who realised that Vasudeva , the one in whom all the worlds reside, is the inner Self of all, Vasudeva also means the one
who covers or envelops the universe . It’s subjective and never objective.
____________________________
బహూనాం జన్మనామన్తే జ్ఞానవాన్మాం ప్రపద్యతే,
వాసుదేవః సర్వమితి స మహాత్మా సుదుర్లభః.
____________________________
నన్దిని
वसतीवरी జ్ఞానులు మిగతా భక్తులకన్నా ఎందుకు విశిష్టులో చెప్పిన భగవన్తుడు జ్ఞానిని మళ్ళీ స్తుతిస్తున్నాడు -
ఎన్నో జన్మలు ఎత్తిన తరువాత జ్ఞానపరిపాకం పొందిన జ్ఞాని నన్ను సాక్షాత్కరించుకుంటాడు.
ఎలా సాక్షాత్కరించుకుంటాడు? వాసుదేవుడే సర్వమూ అని సాక్షాత్కరించుకుంటాడు. వాసుదేవుడు అంటే? అందరిలోనూ ప్రత్యగాత్మ గా ఉన్నవాడు అని ఒక అర్థం.
అటువంటి మహాత్మునితో సముడు లేదా అధికుడు ఉండడు. సముడే ఉండడంటే అధికుడు ఉండడని వేరుగా చెప్పుట ఎందుకు? किं उत ? ( కైముతిక న్యాయము ) మహాత్ముడు విరళంగా మాత్రమే లభిస్తాడు.
బహూనామ్ - చాలా
జన్మనాం అన్తే - జన్మల చివరన
జ్ఞానవాన్ - జ్ఞానం కలవాడు
( సర్వం వాసుదేవః ఇతి - సమస్తమూ వాసుదేవుడే అని. విశ్వాన్ని మాయతో ఆచ్ఛాదించేవాడు కనుక ‘వాసుః’ ; తన ప్రకాశంతోనే వెలిగేవాడు కనుక ‘దేవః’. వాసుః + దేవః = వాసుదేవః, వాసుదేవుడు. ) అటువంటి సూత్రాత్మ యే సర్వమూ అనే జ్ఞానం కలిగిన వాడు మహాత్ముడు. ఏ సాహితీవేత్త యో/ యే నోబెల్ బహుమతి గ్రహీతయో ఇవ్వగలిగిన బిరుదము కాదు.
మాం ప్రపద్యతే - నన్ను పొందుతాడు.
సః మహాత్మా - అట్టి మహాత్ముడు
సుదుర్లభః - లభించుట చాలా అరుదు.
బహు జన్మలు ఎందుకు?
కొద్ది, కొద్దిగా పుణ్యాన్ని ఉపచయం చేసుకునేందుకు !
అన్తే అంటే చరమంలో, చిట్ట చివర
అప్పుడు అన్ని జన్మల పుణ్యాల విపాకరూపమైన జ్ఞానాన్ని పొంది,
ఆ జ్ఞానం ఎటువంటిది? వాసుదేవుడే సర్వము అనే జ్ఞానం.
వాసుదేవుడు అనే జ్ఞానం ఎలా కలిగింది?
సర్వగుడు కనుక సర్వరూపములూ ‘ఆయన’వే అనే భూతజ్ఞానం వాసుదేవజ్ఞానము. ఆ సర్వాత్మ వాసుదేవ జ్ఞానం కలిగిన వాడు,
చరాచరాత్మకమైన ప్రపంచమంతా భ్రాన్తి వల్ల భాసిస్తున్నది గానీ అది వాసుదేవాతిరిక్తము కాదు, वाचारंभणं विकारो नामधेयं मृत्तिकेत्येव सत्यम् అనే శ్రుతి ప్రకారం నన్నే సర్వాధిష్ఠానంగా భావించుట వల్ల వాసుదేవజ్ఞానం కలుగుతుంది.
………………………………………….
మహాత్మా - మహాత్ముడంటే
-
అత్యన్తశుద్ధమైన మనస్సు ఉండుట వల్ల జీవన్ముక్తుడు,
-
సర్వోత్కృష్టుడు = అతనికి సమానమైన వాడు మరొకడు లేనివాడు.
(సముడే లేడంటే ఇంకా అధికుడు ఉండనే వుండడు),
- సర్వమూ, స్వమూ బ్రహ్మమే అనే జ్ఞానం కలవాడు
……………………………………….
ఈ కారణాల చేతనే
सुदुर्लभः కష్టపడి వెతికినా వేలలో ఒకడు కూడా దొరుకడు, ఇతిభావః…mvr
20
____________________________
कामैस्तैस्तैर्हृतज्ञानाः प्रपद्यन्तेन्यदेवताः,
तं तं नियममास्थाय प्रकृत्या नियताः स्वया ।
____________________________
_नन्दिनी
ये तु
तैः तैःकामैः-स्व स्व अभिमतैः इच्छाभिः
अपहृतज्ञानाः-अपहृतविवेकाः सन्तः
अन्यदेवताः-स्वात्मव्यतिरिक्ताः,क्षुद्र देवताः, आगमोक्तदेवताः, शैवाः शाक्ताः वैष्णवाः च इति शङकरानन्दीये
प्रपद्यन्ते-सेवन्ति, भजन्ति
तं तं नियमं-तत्तत् देवतासंबन्धिनियमम्
आस्थाय- तत् तत् तन्त्रे अभिहितम्
आस्थाय = आश्रित्य
स्वया- स्वकीयया
प्रकृत्या-पूर्वाभ्यासवासनया
नियताः-वशीकृताः सन्तः
प्रपद्यन्ते-सेवन्ति,भजन्ति।
In brief,
People who are deprived of knowledge by a variety of cravings resort to other deities like Brahma,Vishnu andShiva , assuming specific fruits accrue from worshippingspecific deities.
The very word Deity (देवता = दीव्यन्तीति ) means the bright ones .
One can worship any deity without craving for some fruit ,निष्कामभक्ति to acquire knowledge of Atma.
On the other hand,one who worships any deity with craving, सकामभक्ति , is going to get that specific fruit but not the Atma Jnaana.
Peoplewho crave for things other than the Knowledge adopt to other disciplines,constrained by their inborn nature - byspecific impressions brought from other births.
Deprived of knowledge,हृतज्ञानाः , the knowledge of discrimination
by a variety of cravings for progeny,cattle,heaven etc पुत्र पशु स्वर्गादि विषयैः
Resortto other deities, आत्मनः अन्याः देवताः
They are constrained by their own inborn nature , प्रकृत्या - स्वभावेन
By specific impressions acquired in other lives , जन्मान्तर संस्कारविशेषेण .
There are no separate deities like Brahma,Vishnu,Shiva , etc.
The same Atma,being in association with Maya is known as Eeshwara.
Eeshwara is addressed as 1.Brahma while performing Creation,
-
Vishnu while ruling and
-
Rudra while destroying!
What is the meaning of ‘other deities’ , अन्य देवताः , then?
The word ‘other’ , अन्य , is used in relation to Atma( meaning Indra,Brahma,Vishnu,Rudra etc.)
worshipping of these
deities can be considered as Saguna Brahma Upaasana.
The worship of Atma whichis Nirguna excels over worshipping Saguna Brahma in the form of Shiva,Vishnu,several village deities etc
____________________________
కామైస్తైస్తైః హృతజ్ఞానాః ప్రపద్యన్తేన్యదేవతాః ,
తం తం నియమమాస్థాయ ప్రకృత్యా నియతాస్స్వయా .
నన్దిని
తైః తైఃకామైః- ఆయా కోరికలచేత
హృతజ్ఞానాః - అపహరించబడిన వివేకంతో
……
స్వయా ప్రకృత్యా-తమ స్వభావంచేత
నియతాః - పరవశులై
……
తం తం నియమం ఆస్థాయ- ఆయా నియమాలను పాటించి
…….
అన్యదేవతాః ప్రపద్యన్తే- ఆత్మేతర దేవతలను చేరుతారు.
ఆర్తుడు ,జిజ్ఞాస కలవాడు,ఐశ్వర్యాకాంక్షి అనే ముగ్గురు భక్తులతో పోలిస్తే జ్ఞానభక్తుడు శ్రేష్ఠుడు అని వివరించిన భగవంతుడు-
సకామ,నిష్కామ భక్తుల భేదాన్ని చర్చిస్తున్నాడు.
ఏ దైవతాన్ని అయినా సరే ఆత్మగా పూజిస్తే చిత్తశుద్ధి కలుగుతుంది;
మాయచే శరీరమూ,ఇన్ద్రియాలూ ఉన్న దేవతలను ఉపాసించుట కన్న ఆత్మోపాసన ప్రశస్యము.
ఫలానా విష్ణువునే పూజించ వలెనని లేదా శివుణ్ణి మాత్రమే పూజించవలెననియో నియమం లేదు.
దేవతోపాసకులలో మూడు రకాలు -
-
కామోపహతులు- ఆత్మ కంటే భిన్నంగా , వేరుగా,శివుణ్ణి కానీ విష్ణువును కానీ మరొక దైవాన్ని గానీ ఉపాసించేవారు కామోపహతులు.
-
ఆత్మోపాసకులు- వీరునిష్కాములు లేదా మోక్షకాములు , వీరు అందఱి కన్నా విశిష్టులు
-
సాకార బ్రహ్మోపాసకులు- మధ్యస్థులైన వీరు నిష్కాములే ఐనా -కేవల శివుణ్ణోలేదా కేవల విష్ణువునో ఉపాసిస్తారు.వీరుఅజ్ఞానులూ కారు ,జ్ఞానులూ కారు.
సకాములు మాయవలని తిరోభావితమైన జ్ఞానం తో
पश्यति पुत्रं , पश्यति पौत्रं. आशास्ते
आयुराशास्ते వంటి శ్రుతి మన్త్రోపాసనలు చేస్తారు.
అపహృతజ్ఞానులు తత్తత్ ఫల సంపాదనకోసం తత్తత్ దేవతోపాసన చేస్తారు.
స్వాత్మతత్త్వ వ్యతిరిక్తులు ‘అన్యుల’ను -“ఆత్మ కన్న అన్యులైన ఇన్ద్ర,శివ,విష్ణ్వాదులను” - భజిస్తారు.
అది అభిలషణీయం కాదు. శివుణ్ణికానీ,విష్ణువును కానీ మరే యితర దేవతనుగానీ ఆత్మరూపంగా భజించవచ్చును. దేవతలలో కొందరు క్షుద్ర దేవతలు అంటూ ఉండరు. అసలు,एकोदेवः सर्वभूतान्तरात्मा అని శ్రుతి కణ్ఠోక్తిగా చెపుతున్నప్పుడు దేవత “లు"అనే బహువచనమే చెల్లుబాటు కాదే! ఇంక దేవతలలో వర్గీకరణ ఉండనే వుండదు కదా!!
దేవతలలో క్షుద్రత్వము ఉండదు ; కామములలో క్షుద్రత్వం ఉన్నది.
కనుక మైసమ్మ,ఎల్లమ్మ , పోచమ్మ శివయ్య, గణేశుడు,ఇన్ద్రుడు,అగ్ని- యే దేవతనైనా సాత్త్వికభావంతో ఆరాధించవచ్చును .
కొందరికి క్షుద్రకామనలే ఎందుకు కలుగవలెను? అంటే,స్వకీయ ప్రకృతి చేత,పూర్వాభ్యాసం వల్లా(duetopreconditioned mind),ఇతిభావః…mvr
21
____________________________________
यो यो यां यां तनुं भक्तः श्रद्धयाऽर्चितुमर्हति ,
तस्य तस्याचलां श्रद्धां तामेव विदधाम्यहम् ।
_____________________________________
नन्दिनी
यां यां तनुं-देवतारूपाम्, शिवरूपां/विष्णुरूपां वा
यः यः भक्तः-कामी, तमोयोगात्
श्रद्धया-आस्तिक्यबुद्ध्या
अर्चितुं इच्छति-आराधयितुं इच्छति
तस्य तस्य-कामिनः भक्तस्य
तामेव-तामेव देवताविषयां श्रद्धाम्
( न तु मद्विषयां श्रद्धाम् )
अहं-अन्तर्यामी
विदधामि-कारयामि।
“य आदित्ये तिष्ठन् आदित्यादन्तरो अयमादित्यो न वेदयस्यादित्यःशरीरं
… यमयति आत्मनि तिष्ठन् “। इति श्रुतेः ,
To those desire ridden people -
In brief ,
I give unswerving faith to each devotee who seeks to worship any divine form of his choice .
I make the faith steadfast -
among the seekers of the objects ,सकामाः , who ever seeks to worship the divine form of his choice.
____________________________
యో యో యాం యాం తనుం భక్తఃశ్రద్ధయాఽర్చితుమిచ్ఛతి,
తస్య తస్యాచలాం శ్రద్ధాం తామేవ విదధామ్యహమ్.
________________________________________
నన్దిని
సకాముల విషయంలో
ఏ యే భక్తుడు, ఏయే దేవతాశరీరాన్ని శ్రద్ధగా పూజించ దలుచుకుంటే -
అయా భక్తునికి,ఆయా దేవతాశరీరపూజలో స్థిరమైన శ్రద్ధను నేను ఏర్పరుస్తాను.
సర్వవ్యాపకుడైన ఈశ్వరునికి సర్వమూ శరీరమే- అనగా సర్వమూ ఈశ్వర శరీరమే! అటువంటప్పుడు,ఈశ్వరుడు అశరీరి అనే శ్రుతికి వైరుధ్యం ప్రాప్తిస్తుంది గదా అంటే-
ఈశ్వరుడు మాయాసాంగత్యంతో సశరీరి కూడా కావచ్చును , అఘటన ఘటనా పటీయసీ మాయా అని లోకప్రసిద్ధి ఉన్న విషయమే కదా!
తత్తద్దేవతాప్రసాదం వల్ల జ్ఞానభక్తి లేనివారికి కూడా కాలక్రమంలో ‘వాసుదేవ’ భక్తి ఏర్పడుతుంది.
వాసుదేవుడుఅనగా అందరికీ అన్తర్యామి యైనవాడు.
శ్రుతి य आदित्ये तिष्ठन् यस्य आदित्यःशरीरम्न वेद यस्यादित्यःशरीरं य आदित्यमन्तरो यमयति य आत्मनि तिष्ठन्
- అన్తర్యామినైన నేను ఆదిత్యునిలో , ఆదిత్యునికి తెలియకుండా ఉండిఆదిత్యుణ్ణి నియమనం చేస్తాను అని చెప్పింది.
యః యఃభక్తః- ఏయే భక్తుడు
యాం యాం తనుం- ఏయే దేవతా రూపంగా ( कामितार्थं तनोतीति तनुः)
శ్రద్ధయా అర్చితుం-శ్రద్ధతో పూజించేందుకు
ఇచ్ఛతి- కోరునో,
…………
తస్య తస్య- ఆయా కోరికలు కలవానికి
తాం శ్రద్ధామేవ- ఆ శ్రద్ధనే
అచలాం- కదులకుండా,సుస్థిరం గా
అహం విదధామి- నేను చేస్తాను , ఇతిభావః…mvr
22
SANSKRIT/ ENGLISH/ TELUGU
_____________________________________
स तया श्रद्धयायुक्तस्तस्याराधनमीहते,
लभतेच ततः कामान् मयैव विहितान् हितान् ।
____________________________
नन्दिनी
स भक्तः
तया- दृढया
श्रद्धया युक्तः
तस्याः-स्व स्व देवतायाः
राधनं-आराधनम्( मन्त्र जप होमादि)
ईहते-निर्वर्तयति।
लभते च ततः
तस्याः-देवतातन्वाः
विहितान्-देवतया दापितान्
हितान्-इष्टान् कामान् ( अपि )
मया एव- तत् तत्
देवता-अन्तर्यामिना मया ( स्वातन्त्र्येणफलदाने देवतानां शक्तिः नास्ति)
कामान्-ईप्सितान्
लभते-प्राप्नोति ।
अत्रव्यञ्जना-मूढाः देवतान्तरं भजन्ति , इति
श्रुतय ऊचुः
हिः =प्रसिद्ध्यर्थे
—- “कर्माध्यक्षः सर्वभूताधिवासः”
—- “एष एव साधुकर्म कारयति”
—- “एको बहूनां यो विदधाति कामान्”
Who ever seeks to worship a divine form with faith,
In brief ,
he desires the worship of that form because of the faith.
He secures the objects of his desires from that divinityas I Myself have ordained them.
Why should the devotee receive what is ordained by Bhagavan,rather than what ever he desires?
Because objects of Kaama,desire,do no good at times.
పూర్వశ్లోకంలో- స కామి ఇష్టపడే దేవతారూపం పైననే భగవన్తుడుస్థిరమైన శ్రద్ధను ఏర్పఱచిన తరువాత ఆ సకామి
____________________________
స తయా శ్రద్ధయా యుక్తస్తస్యారాధనమీహతే,
లభతేచ తతః కామాన్ మయైవ విహితాన్ హితాన్.
నన్దిని
ఆ భక్తుడు ఆ స్వరూపారాధనతో తనకు ఇష్టమైన కోరికలను పొందుతాడు; కానైతే ఆ కోరికలను తీర్చేది మాత్రంనేనే !
సః- అట్టి భక్తుడు
తయా శ్రద్ధయా యుక్తః- ఆ శ్రద్ధతో కూడి
తస్య ఆరాధనం ఈహతే- ఆ దేవతారాధనను కోరుతాడు.
………….
తతః- ఆ దేవతా స్వరూపం నుండి ,
మయా ఏవ విహితాన్- నా చేతనే ఇయ్యబడ్డ
హితాన్ కామాన్- భక్తుడు హితాలుగా భావించే కోరికలను
లభతే-పొందుతాడు.
राधनं / आराधनम् ?
రాధనమా/ ఆరాధనమా? , నిరుపసర్గమా/ సోపసర్గమా?
రాధనం అంటే ఆరాధనం- లేదా- తయా + ఆరాధనం ( పూజ) అని (సవర్ణదీర్ఘసంధిగానే) అనుకోవచ్చు. సోపసర్గమైతే ఆసమంతాత్ రాధనమ్ అని చెప్పుకోవచ్చు.
विहितान् हितान् అనుచో अहितत्वेपि हिततया प्रतीयमानान् అని మధుసూదన సరస్వతి ‘హితం కాకపోయినా- హితం అన్నట్టు భాసించే’ అనే సున్దరమైన అర్థాన్ని చెప్పారు!
हितान्
శ్లోకం ఉత్తరార్ధంలో హితాన్ అనే పదాన్ని కొందరుకామపదానికి విశేషణంగా చెప్పారు,అయితే అప్పుడు ‘హితమైన కోరిక’అనే అర్థం వస్తుంది .
కామాలు ప్రియాలైతే కావచ్చునేమో కానీ హితమైన కామం ఉండదని ఒక ఆక్షేపం తల యెత్తవచ్చును. ( हितमपि रमणीयं,हिरण्यं
హితమపి రమణీయం అని హిరణ్యానికి మాత్రము చెల్లుబాటు లో ఉన్నది).
हितान् / हि - तान् అని పద విభాగం చేయుట
హిః = ప్రసిద్ధమైన , తాన్ = కామ్యాలనుఅనే అర్థం చెప్పుట సులభమే ఐనా,ఈశ్వరుడు ఉపాసకులకోసం కామ్యాలను తయారుచేసినాడని సనాతన ధర్మం లో కనబడదు కనుక हिः = प्रसिद्ध्यर्थे అనలేము.
ఉపాసకులు దేవతల ద్వారా (వయా) కోరికలను పొందుట తెలిసిందే కానీ मयैव विहितान्అనిఉండుట వల్ల ప్రసిద్ధ్యర్థము కుదురదని భాష్యార్క ప్రకాశికా కారుల అభిప్రాయము.
శ్రీరామానుజుల “ఆయా దేవతలను ఆరాధించే వారికి,ఆయా ఫలదాతను నేనే” అనే వ్యాఖ్య కూడాయుక్తమే అని బెల్లంకొండ వారు ప్రశంసించుట గమనార్హము.
ఇది యెలా సమంజసం అంటే,
ఈశ్వరుడు మాయకు అధిష్ఠానము. నిర్ధర్మకమైన ఆత్మ -ఫలదాత కాలేదుగద!
व्यञ्जना వ్యంజన
ఈ శ్లోకంలోని వ్యంగ్యమర్యాదాయుతార్థం - అన్ని కోరికలనూ ఆత్మభూతుడనైన నేనే ప్రసాదిస్తూ ఉండగా , మూఢులు అనాత్మభూతమైన అన్యదేవతలను భజిస్తున్నారు,అని. అనాత్మలు అస్వాతంత్ర్యములు కూడా!
भाग्यनगरीय माण्डलिक प्रयोगः
శంకరానందీయ టీకాకారుడు विहितान् = ‘దత్తాన్,దేవతయా దాపితాన్ ’ అనే వాక్యార్థం చేసినాడు.చాయ్ తాపవా ( తాగించవా) అనే ప్రయోగం,1970 లో హైదరాబాధ మాండలికం గా భావించి ఉన్నాను. తరువాత కాలంలో సంస్కృతమూలం తెలిసి సంతోషించాను.
……………..
మొత్తం మీద,సకామియైన భక్తుడు- భగవన్తుడు నిర్దేశించినట్టి దేవతాతనువును శ్రద్ధగా ఆరాధించి,ఆ దేవతలకు కూడా అంతర్యామి యైన భగవన్తుడు ప్రసాదించిన అభిలషితాలను పొందుతాడు,ఇతిభావః …mvr
23
_____________________________________
अन्तवत्तु फलं तेषां तद्भवत्यल्पमेधसां ,
देवान् देवयजो यन्ति मद्भक्ता यन्ति मामपि ।
____________________________
नन्दिनी
साक्षात् मद्भक्तानां च/ क्षुद्रदेवतानां च आराधना भिद्यते-
१ ) आयास वैषम्येन
२ ) फलवैषम्येन च।
अल्पमेधसां-वस्तुविवेकरहितानाम्
तेषां-क्षुद्रदेवताभक्तानाम्
फलं-तत् देवताविशेषाराधनफलम्
अन्तवत्-विनाशी
(भवति)
यदि उपास्यभूत देवा एव अन्तवन्तः, तर्हि तद्दत्तं फलं अन्तवत् भवेदिति किमु वक्तव्यम्?
मद्भक्ताः तु
प्रथमं कामान् प्राप्नुवन्ति
अपि-ततः उपासनापरिपाकात्
मां-ईश्वरमपि
यान्ति-प्राप्नुवन्ति।
समाने अपि प्रयासे सकामत्वे अन्तरं विद्यते मद्भक्तानां अन्यदेवताभक्तानां च ।
As desire-bound people and undiscriminating individuals operate with finite means, their operations must come to an end -
In brief,
The resultant fruit of Karmas accruing to those immature persons must come to an end.
The worshippers of gods proceed to the gods; My devotees come to Me .
The fruit of the performers of Karma , having a feeble understanding,is finite,will end.Worshippers of non- Atma gain impermanent results. Worshippers of Atma will reach Me ie they gain Myform.
The effort and exertion are similar for both the worshippers!
అశాశ్వత సాధనాలతో,అవివేకంగా చేసే ఉపాసనల వల్ల
ఫలితం కూడా అశాశ్వతమే అవుతుంది-
____________________________
అన్తవత్తు ఫలం తేషాం తద్భవత్యల్పమేధసాం,
దేవాన్ దేవయజో యాన్తి మద్భక్తాయాన్తి మామపి.
నన్దిని
అల్పబుద్ధులైనవారు పొందే ఫలం కొంతకాలం మాత్రమే ఉంటుంది. అనాత్మ భక్తులు పొందే ఇన్ద్రియ సుఖాలు శాశ్వతం కావు.
పరమాత్మ భక్తులు పరమాత్మనే పొందుతారు.
అల్పమేధసాం తేషామ్ - అల్పబుద్ధులైన వారి
ఫలం అన్తవత్ భవతి - ఫలితము అన్తంకలదే అవుతుంది.
………..
దేవయజః దేవాన్ యాన్తి- దేవతా భక్తి కలవారు దేవతలను మాత్రమే పొందుతారు.
మద్భక్తా మాం యాన్తి- ఆత్మారాధకులు నన్నే పొందుతారు.
श्रुतय ऊचुः
-
यो वा एतदक्षरं गार्ग्यविदित्वा अस्मिंल्लोके जुहोति यजते तपस्तप्यते अन्तवदेवास्यं तद्भवति ఆత్మకాని అన్య దేవతాభజనం అన్తవత్తు,నశించేది,ముక్తిప్రదం కాదు
-
“कर्मणा पितृलोको विद्यया देवलोकः” (కర్మలతో పితృలోకమూ,జ్ఞానంతో ముక్తి)
-
“देवो भूत्वा देवानप्येति” అనే వాక్యాల ఆధారంగా దేవయజులు ఆయా దేవతా రూపాన్నీ , ఆయా దేవత యొక్కలోకాన్నీ పొందుతారు- మోక్షాన్ని కాదు !
-
“स यो हैवानन्तवत उपास्ते अन्तवन्तं स लोकं जयत्यथ यो हैताननन्तानुपास्तेअनन्तं स लोकं जयति” ( शातपथं ) అన్తం కల దేవతల ఉపాసనఅన్తవత్తులైన లోకాలనూ , ఆత్మోపాసన ఆద్యన్తరహితమైన లోకాన్నీ ప్రాప్తింపజేస్తుంది ( జయతి = ప్రాప్నోతి),
అని ఆత్మోపాసన/ దేవతోపాసన లలో ఫల వైషమ్యాన్ని తెలుపుతున్నాయి.
కనుక సకామత్వం సమానమే ఐనా, ఫలంలో తేడా ఉన్నది.
అంతేకాదు,तु’తు’ అనే శబ్దం వల్ల పరమాత్మను యజించే వారు మొదట పరమాత్మ ప్రసన్నుడగుట వల్ల అభీష్టాలనూ,తదనన్తరం ఈశ్వరుని కూడా పొందుతారు.
సమప్రయాస/ అసమ ప్రయాస, అనూహ్యఫలవ్యత్యయము
సాధారణంగా గొప్ప ఫలితం కోసం ఎక్కువగా కష్టపడుట; తక్కువ ఫలితం అయితే కొద్ది యత్నం అవసరమవుతాయి.
ఉభయ క్రియలలోనూ సమ ప్రయాస యేనని( समानेप्यायासे) టీకాకారులందరూ వాక్రుచ్చగా-
తద్విరుద్ధంగా ఆత్మోపాసనకు మానసిక క్లేశమాత్రం చేత అనన్త ఫలం వస్తూఉండగా,
అనాత్మలైన దేవతల ఆరాధనకు శారీరక,వాచిక,మానసిక క్లేశాలు అన్నీ ఉన్నా (अहो खलु कष्टतरं वर्तंते … ) ఫలం మాత్రం సాన్తమని ఒక సూక్ష్మ భేదాన్ని భాష్యార్కప్రకాశికా కారుడు -ఆక్రోశపూర్వకంగా భగవన్తుడు చెప్పాడని- విదితం చేసినాడు.
అంటే, అనాత్మారాధనతో పోలిస్తేఆత్మను ఉపాసించుటయే అల్పప్రయాసతో అనల్పార్థప్రదము (like mechanical advantage in physics) అధిక తర శ్రేయోదాయకము అని వివరించాడు.
अल्पमेधसाः(మన్ద బుద్ధులు) , అనగా
-
అసత్ త్యాగం
-
సత్ ఆధానమూ మొదలైన క్రియలకు అనర్హులు అని అర్థం.
కొందరు టీకాకారులు ఒక దేవతనుఉత్కృష్టం/ ప్రధానంగానూ,అన్య దేవతలను ఆరాధించుట పరివారాత్మకంగా చేయుట - కార్యమని వ్యాఖ్యానించారు,ఇది సంతృప్తీకరణవిధానంగా (appeasement policy వలె) కనబడుతున్నది, ఇతిభావః ….mvr
24
अव्यक्तं व्यक्तिमापन्नं मन्यन्ते मामबुद्धयः ,
परं भावमजानन्तो ममाव्ययमनुत्तमम् ।
____________________________
नन्दिनी
किं निमित्तं मामेव न प्रपद्यन्ते ?
अव्यक्तं- कारणरूपेणस्थितम्( स्थूलदेहरहितम्)
व्यक्तिं आपन्नं- कार्यरूपेण श्रीकृष्णादि कार्यरूपतां प्राप्तम्
इति
अबुद्धयः- अल्पबुद्धयः ( आत्मानात्म विवेकरहिताः)
मन्यन्ते।
को वा तत्र हेतुः?
मम ईश्वरस्य
परं भावं- स्वरूपम्, सर्वकारणरूपम्
अजानन्तः
कथं भूतं भावं अजानन्तः?
a) अव्ययं-सोपाधिकं,नित्यं ( दृश्यस्य नाशे सत्यपि स्वयं नाशरहितम्)
अजानन्तः
तथा
b) अनुत्तमं-निरुपाधिकं,
सर्वोत्कृष्टं आपि अजानन्तः
( “सा काष्ठा सा परागतिः” - इति श्रुतेः)
देवतान्तरं भजन्ते;अन्तवत्फलं प्राप्नुवन्ति।
In brief,
The men with lack of discrimination and ignorance assume that Me the un-manifest have become manifest and the un-revealed have become revealed. It is not so.
I am ever present.
My supreme aspect is neither mutable,nor surpassable.
ఎందుకు నన్నే ఆశ్రయించరు?
____________________________
అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యన్తే మామబుద్ధయః ,
పరం భావమజానన్తో మమావ్యయమనుత్తమమ్ .
నన్దిని
నా పరస్వరూపం అత్యుత్తమము ,మార్పు చేర్పులు లేనిది ; ఈ విషయం తెలియని అల్పజ్ఞులు-అంతకు ముందు వ్యక్తంగా లేని నేను ఒకానొక సమయంలో వ్యక్తమైనానని భావిస్తారు.
మమ- నా
అవ్యయం- మార్పులు చెందని
అనుత్తమం- ఇంతకంటే ఉత్తమం మరొకటి ఉండని
పరం భావమ్ - గొప్ప స్వరూపాన్ని
అజానన్తః- తెలియని వారు
అబుద్ధయః- వివేక రహితులు,
………..
వ్యక్తి- ప్రకాశము, ఇక్కడ ప్రకాశం అంటే జ్ఞానము.
అవ్యక్తం -ప్రకాశరాహిత్యం,అంటే ఇక్కడ అజ్ఞానము. లేదాకారణ రూపము,
వ్యక్తిమాపన్నం- వ్యక్తము,జ్ఞాతమైనది. లేదా, కార్యరూపము.
మన్యన్తే- భావిస్తున్నారు.
పరం- ఉత్కృష్టము
భావమ్- స్వరూపము {సత్,చిత్,ఆనందం ( सत् श्री अकाल् )}
వ్యయమ్ - నాశము/ వికారము/ మార్పు
అనుత్తమమ్-न विद्यते उत्तमो यस्मात् ఇంతకంటే ఉత్తముడు లేడు అనే అర్థం (చూ.సహస్రనామాలు ).
सा काष्ठा सा परागति: అని శ్రుతి.
అవ్యక్తం వ్యక్తిమాపన్నమ్- ఏ వైకుంఠంలోనో అంతవరకూ కనబడకుండా ఉన్న వాణ్ణి - ఇప్పుడు అపరోక్షంగా ప్రత్యక్షంగా కనబడుతున్నాను అనుకుంటారు.
మమ- ‘నా’ అని కనబడేది राहोश्शिरः ‘రాహువు యొక్క శిరస్సు’అనుటలో భేదనిర్దేశం వలె
కేవలం ఔపచారికము. రాహువు ఛాయాగ్రహము; రాహువుకు తలా తోకా ఉండవు కదా!
………………………………………
ఉపచారం అంటే అధిక గౌరవాన్ని ప్రదర్శించుట , ఒకచో కనబడుతున్న అర్థాన్ని విడిచిపెట్టిఇతర అర్థాన్ని చెప్పుట( औपचारिकं =
शक्यार्थत्यागेन अन्यार्थबोधनम् ) .
…………………………………………
జీవునికీ, పరమాత్మకూ అభేదాన్ని తెలియనివారు-వైకుణ్ఠగతుడైన విష్ణువు శ్రీకృష్ణావతారం ధరించినాడని, భావిస్తున్నారు. మఱి శ్రీకృష్ణావతార రహస్యం ఏమిటి? అంటే,
‘మాయ’ !
మాయ ఆత్మ యొక్క,అనగా,ఈశ్వరుని స్వభావశక్తి.
मम माया दुरत्यया అని ఈశ్వరుడు తానే చెప్పినట్లుగానూ,గీతలలోపలుమార్లు,పలుచోట్ల వక్కాణించినట్లూ మాయ మనకు రామ కృష్ణాద్యవతారాలలో స్పష్టీకృతము.
మాయయే శ్రీకృష్ణుడుగా దృశ్యమానమైంది; మాయయే జీవుల రూపంలో దృశ్యమానమవుతున్నది.
ఐతే,సాధారణ జీవులకు అవతార శబ్దం అన్వయించలేకపోవుట ఎందుకు?
-
ఆత్మ యొక్కమాయాశక్తి సాక్షాత్ శ్రీకృష్ణాద్యవతారాలుగా పరిణమించింది.
-
ఆత్మ యొక్క మాయాశక్తియే మహత్,అహంకారం మొదలైన భూతాల ద్వారా మనుష్యాదులుగా కూడా కనబడుతున్నది.
కనుక,
సాక్షాత్ మాయామయం - అభౌతిక ( దివ్య) ,అప్రాకృత ‘అవతారం’ కాగా ….
భౌతికం,ప్రాకృతం ఐన మాయ జీవుడు.
భాగవతం,విదుర మైత్రేయ సంవాదం( 3.7.2నుండి3.7.11)లో మూడు ప్రశ్నలు,వాటికి మూడు జవాబులూ ఉన్నవి.
1.నిర్గుణ పరబ్రహ్మ కు గుణసంబన్ధం ఎలా సాధ్యం?
( सेयं माया ఇది అఘటన ఘటనాపటుత్వం కల మాయకు సాధ్యమే).
- దేశతః,కాలతఃవిజ్ఞానం కలవానికి ప్రకృతితో సంబన్ధం ఎలా కలిగింది?
(स्वशिरश्छेदनादिनाకలలో తన తలయే ఛేదించబడుటను- తానే చూచినట్లు)
- సర్వగతుడైన భగవంతుడు గర్భస్థ పిణ్డమై,గర్భవాసాది క్లేశాలను అనుభవించుట ఏమిటి?
( जलगत चन्द्रकम्प इव నీళ్ళను కదిలిస్తే నీటిలోని చన్ద్రప్రతిబింబం కదిలినట్లు అనాత్మగుణం ఆత్మలో భాసించుట వల్ల) .
మాయనేగనుక అంగీకరించనిచో,శ్రీరామావతారంలో చెట్టు చాటునుండి వాలివధ చేసినందున, శ్రీకృష్ణావతారంలో కిరాతశరతాడనకృత శరీరవియోగం మొదలైన వాటివల్ల ఈశ్వరునికి ఈశ్వరత్వ భంగం వాటిల్లుతుంది!
…………..
अबुद्धयः-మన్దమతులు రెండు విధాలు -
- ఆత్మ/ అనాత్మ భేదం తెలియని వారు - మూఢులు, (ఆత్మ భిన్నాలన్నీ అనాత్మలే ) .
ఆత్మానాత్మవివేకం లేనివారే రాముణ్ణీ,కృష్ణుణ్ణీ,శివుణ్ణీ,అగస్త్యుణ్ణీ ఈశ్వరులుగా భావిస్తున్నారు.
2 . అనాత్మలలో తరతమ భేదం తెలియని వారు , వీరు ఇంకా ఎక్కువ మన్దమతులు.
భౌతికదేహంలో ఉన్న ఆత్మను జీవుడు అనీ,అభౌతిక ( దివ్య )దేహంలో ఉన్న ఆత్మను ఈశ్వరుడు అనీ వ్యవహరిస్తాము.
వివేకవన్తులు మాత్రం ఉపాధి ( శరీరం) లేని,సచ్చిదానన్ద ఘన ఆత్మను మాత్రమే ఈశ్వరుడు అంటారు,
ఇతిభావః…mvr
25
तदज्ञानं किं निमित्तं ? _
नाहं प्रकाशः सर्वस्य योगमायासमावृतः ,
मूढोयं नाभिजानाति लोको मामजमव्यम् ।
____________________________
नन्दिनी
त्वयि कथं मनुष्यबुद्धिः, जीवबुद्धिः वा इति अर्जुनस्य आशङ्कायां आह भगवान्-
अहं
सर्वस्य-सर्वस्य लोकस्य
न प्रकाशः-अप्राकृतेन स्वेन रूपेण न प्रकटो भवामि।
तत्र हेतुः
योगमाया समावृतः इति ।
योगः-मत् सङ्कल्पः
योगमाया-मत् सङ्कल्पवशवर्तिनी माया
को वा सङ्कल्पः?
अभक्तो जनः मां स्वरूपेण न जानातु इति।
तयायोगमायया
समावृतः-सम्यक् आच्छन्नः।
अतः मम मायया
मूढः-आवरणात्मिका मायया विपरीतभावं प्राप्तः
अयं लोकः ,
मां
१) अजं-अनादिम्
२) अव्ययं-अनन्तम्
न अभिजानाति-साक्षात् परमेश्वर इति न जानाति। ( मनुष्यमात्र इति जानाति। )
विपरीतभावनां करोति।
विपरीतभावना = अतस्मिंस्तद्बुद्धिः ( देहे आत्मत्वबुद्धिर्यथा)
विद्यमानं वस्तुं आवृणोति; अविद्यमानं च किञ्चित् दर्शयति च ।
What is the cause of their ignorance?
In brief,
I don’t stand revealed to all those who are veiled by the delusive power of My Yoga Maya.
This deluded world knows Me not as unborn and immutable.
…….
I am revealed to very few devotees of Mine . This world is veiled by the delusive power of Yoga Maya -
Yoga is combo/ fabrication of Prakriti’s components and this combo is Maya. योगः गुणानां घटनं , सैव माया योगमाया
అజ్ఞానం ఏ కారణం వల్ల కలిగింది?అంటే,
____________________________
నాహంప్రకాశః సర్వస్య యోగమాయాసమావృతః,
మూఢోయం నాభిజానాతి లోకోమామజమవ్యయమ్__
నన్దిని
యోగమాయను కప్పుకొని వున్న నేను అందరికీ స్ఫుటంగా తెలియను.
పుట్టుక లేని,మార్పులు లేని నన్నుయీ మూఢలోకం గుర్తించలేదు.
యోగమాయా సమావృతః అహం - మాయను కప్పుకొని ఉన్న నేను
అహం సర్వస్య ప్రకాశః న- నేను అందఱికీ సుస్పష్టంగా తెలియను.
……….
అజమ్- జన్మలేని
అవ్యయమ్- ఏ మార్పూ లేని
మామ్- నన్ను
లోకః న అభిజానాతి- లోకంగుర్తించజాలదు.
నీ జ్ఞానం అందరికీ ఎందుకు కలుగదు? అంటే,
నేను అందరికీ ప్రకాశుడను కాను,అప్రాకృతమైన నారూపంతో ప్రకటము కాను.
ఎందుకు ప్రకటం కావు,అంటే హేతువు ఇది ’ योगमाया समावृतः’,
యోగం = నా సంకల్పము,ఆ సంకల్పాధీనమైన మాయ యోగమాయ. ఈ తెర/ ముసుగును ధరించుట వల్ల నేను చూడబడను.
मूढः అంటే ఆవృత జ్ఞానం కలవాడు,మాయచేత జ్ఞానం కప్పబడినవాడు.
అట్టి యోగమాయచేత జ్ఞానం ఆవృతమై మూఢస్థితిలో ఉన్న లోకము,నన్ను గుర్తించలేదు.
ఎటువంటి ‘నన్ను’ ?
अजम् జన్మ కర్మ శూన్యుడనైన నన్ను
జన్మ కర్మలు లేకుండా వుంటే మరి యెందుకు ఆవిర్భవించుట? అంటే, లీలయా జన్మ ( లీలా మాత్రంగా పుట్టుట. )
ఇంకా ఎలా ఆవిర్భవించుట? అంటే,अव्ययम् అజహత్ స్వరూప గుణశక్తులతో అని సమాధానం.
(जहत्అంటే విడిచిపెట్టిన
अजहत्అనగా విడిచిపెట్టని),
नाभिजानाति అంటే సాక్షాత్ పరమేశ్వరుడే నని గుర్తించరు;
ఏదో,మనుష్యులలో కొంచెం విశేషం ఉన్నవాడు అని ఈషణ్మాత్రం తెలుసుకుంటారు. లేదా
నా భక్తులలో యే కొద్దిమందికి మాత్రమో ప్రకటమౌతాను.
अजः
न जायते इत्यजा పుట్టుక లేనిదని, పుట్టుక ఉపలక్షణమైతే జన్మ,స్థితి,లయ రహితత్వము,కాలత్రయంలోనూ అబాధితత్వమూ (सत् श्री अकाल् ) ,
अन्वयः
ते ब्रह्मलोकेषु परान्तकाले అని ప్రకృతికి కూడా లయం వేదంలో వినబడుతున్నది కనుక అవ్యయత్వ విశేషణము , ఇతిభావః …mvr
26
_____________________________________
वेदाहं समतीतानि वर्तमानानि चार्जुन,
भविष्याणि च भूतानि मां तु वेद न कश्चन ।
____________________________
नन्दिनी
अहं-परमेश्वरः , “अप्रतिबद्धविज्ञानः”,
समतीतानि- गतानि
वर्तमानानि- वर्तमानमिति भूत भविष्य कालयोः अन्तरे यदस्ति तत् कालभेदिशब्दप्रयोगः।तच्च चतुर्विधः,
अ) प्रवृत्तोपरतः ( उदा - अद्य प्रभृति मांसं न खादति )
आ) वृत्ताविरतः ( उदा - इहैव कुमाराः क्रीडन्ति)
इ) नित्य प्रवृत्तः ( उदा - पर्वताः तिष्ठन्ति )
ई) सामीप्यः { तच्च पुनः द्विविधः,
1 भूतसामीप्यः ( कदा आगतोऽसि इति प्रश्ने , अध्वस्वेदादिर्वर्तमानत्वात्_एषोऽहमागच्छामि_ इति वदति !
2 भविष्यत्सामीप्यः ( कदा गमिष्यसि? इति प्रश्ने गमने क्रियमाणोद्यमोऽपि_एषोऽहं गच्छामि_इति वदति }
भविष्याणि-भावीनि
( कालत्रयवर्तीनि)
भूतानि-स्थावरजङ्गमानि सर्वाणि
वेद-जानामि।
मां तु-तु शब्दः ज्ञानप्रतिबन्धद्योतनार्थः
न कश्चन वेद- मन्मायामोहितत्वात् न कोऽपिवेत्ति।
अर्जुन!- शुद्ध ! , अहं तु त्रिकालज्ञः, सर्वाणि भूतानि जानामि ( वेदाहं)।
त्वमपि योगादि अभ्यासेन शुद्धान्तःकरणः सन् ज्ञातुं शक्नोसि इतिसूचयन्संबुद्धिः ।
परमेश्वरः लोकान् मोहयति; मदनुग्रहपात्रं विना मां कोऽपि न वेद।
The delusive power Maya veiling the world does not affect the Bhagavan Himself.
It’s like a magician’s delusive power not deluding the magician himself.
That being the fact -
In brief,
Arjuna! I know the beings’past,present and future ; but none knows Me.
I know the beings who passed out already,
those who exist now and those who come into being in future , though none knows Me except my Devotee who sought refuge in Me.
Many ignore Me and don’t worship Me due to the lack of knowledge of My truth.
లోకం యోగమాయచేత కప్పబడి నన్ను గుర్తించగలుగుట లేదు; మాయ నా చెప్పుచేతల్లో ఉండేది కనుక , నా జ్ఞానాన్ని ప్రభావితం చేయుట లేదు -
ఐన్ద్రజాలికుని మాయ ఐన్ద్రజాలికుణ్ణి లోబరుచుకోనట్లు .
यतः एवम् अतः ఇది ఇలా ఉండగా-
________________________________________
వేదాహం సమతీతానివర్తమానానిచార్జున,
భవిష్యాణి చ భూతానిమాం తు వేద న కశ్చన.
నన్దిని
నేను గడిచిపోయిన,ప్రస్తుతం ఉన్న,భావిలో పుట్టబోయే ప్రాణుల గుఱించి కూడా తెలిసిన వాణ్ణి.నా గుఱించిమాత్రం ఎవరికీ తెలియదు.
సమతీతాని -గతించిన
వర్తమానాని-ప్రస్తుతం ఉన్నవి వర్తమానాలు _.
వర్తమానం అనేది భూతకాలానికీ, భవిష్యత్ కాలానికీ మధ్యలో ఉండే కాలభేదము.
వర్తమానం నాలుగు విధాలు-
- ప్రవృత్తోపరతము - “ఇక ముందు మాంసం తినడు " అన్నప్పుడు - మొదట తినేవాడు- ఇక పై తినడు అని నివృత్తి.సూచకము.
2 . వృత్తావిరతము-” పిల్లలుఆడుకుంటారు” అన్నప్పుడు ఆ తరుణంలో ఆడుతూ లేనప్పటికీ, పూర్వక్రీడనం ఉండనే ఉన్నది కనుక విరతి లేకపోవుట.
-
నిత్య ప్రవృత్త వర్తమానము-పర్వతాలు నిలుచున్నాయి అన్నప్పుడు, పర్వతాలు స్థిరాలు కనుక ఎల్లప్పుడూ నిలిచియే ఉన్నాభూత, భవిష్యత్ కాలాల వివక్షతో అలా మాట్లాడితాము.
-
సామీప్య వర్తమానము-ఇది రెండు ఉప విధాలు కలది …
అ) భూతసామీప్యము , “ఎప్పుడు వచ్చావు “అని అడిగితేప్రయాణ శ్రమ కనబడుతూనే ఉన్నా “ఇదుగో, ఇప్పుడే వస్తున్నాను” అన్నట్టు.
ఆ) భవిష్యత్ సామీప్యము,
“ఎప్పుడు వెళ్ళుతావు?“అని అడిగితే, బయలుదేరియే ఉన్నా “ఇదుగో, పోతాను” అనుట వలె.
భవిష్యాణి చ భూతాని - రాబోయేవీ ఐన ప్రాణుల గుఱించి
అహం వేద-నాకు తెలుసును.
………..
మాం తు -నన్ను గుఱించిమాత్రం
కశ్చన- ఎవడూ కూడా
న వేద - తెలుసుకోలేడు.
భోక్త అనుభవం కోసం నానుండియే పుట్టిన మనస్సు,బుద్ధి మొదలైనవి భూతములు.
నేను గడిచిన,వర్తమాన,భావి - త్రికాలాలలోని -అన్నిభూతాలనూ,ఆ భూతాల వ్యాపారాలనూ ఎఱుగుదును.
నేను ఎఱుగుటయే కాదు,నువ్వు కూడా యీ గీతలను శుద్ధాన్తఃకరణంతో వినుట ద్వారా తెలుసుకోగలవని చెప్పేదేమున్నది, किमु वक्तव्यं ? అని अर्जुन శబ్దంతో సంబోధన.
జాగ్రత్ స్వప్నసుషుప్తి అవస్థలలో భూతాలకు సత్త,స్ఫూర్తి,శక్తులను నేనే ఇస్తాను. దేహేన్ద్రియాల ప్రవృత్తి నివృత్తులూ,అవస్థాభేదంతో వాటి సత్త/ అసత్త కూడా నాకు తెలుసును. “जाग्रत् स्वप्न सुषुप्त्यादि प्रपञ्चं यत् प्रकाशते” మొదలైన శ్రుతులతో ఆత్మ,అనగా నా , పై అవిద్యారూప ఆవరణం ఉండదని తెలుస్తున్నది కనుక- నేను మూడు కాలాలనూఎఱుగుదును,అన్ని ప్రాణుల గురించీ నాకు తెలుసును.
ఇక్కడ జీవ,ఈశ్వరుల గుఱించిన యత్కించిత్అవగాహన అవసరము.
అన్తఃకరణోపహిత చైతన్యం ప్రత్యగాత్మ ; మాయోపహిత చైతన్యం ఈశ్వరుడు.
ఉపాధిభేదం తప్ప ‘బ్రహ్మ మొక్కటే’
-
ఉపాధికృతమైన అజ్ఞత్వ ,సంసారిత్వ ధర్మాలతో జీవునికి తెలియకపోవుట !
-
ఈశ్వరోపాధికృతమైన ప్రాజ్ఞత్వ,అసంసారిత్వ ధర్మాలతో ఈశ్వరునికి అన్నీ తెలియుట !!
జీవుని స్వరూపం ప్రత్యగాత్మ ;
ఈశ్వరుని స్వరూపం బ్రహ్మ.
अहं तु सर्वं वेदఅనుచోట సర్వ అవభాసకత్వం,
मांतु वेद न कश्चन అనేటప్పుడు అనన్య భాస్యత్వం తెలుస్తున్నాయి.
……………
బింబ ప్రతిబింబ విషయం కూడా కొద్దిగా చర్చించుదాము.
బింబభూతమైన చైతన్యం ప్రత్యగాత్మ, ఈశ్వరుడు ;
ప్రతిబింబభూత చైతన్యం జీవుడు.
శుద్ధచైతన్యమైన బ్రహ్మ -బింబము, కాన కార్యం కరణం లేవు. ; అయితే,చైతన్యరూపి కనుక సర్వజ్ఞత్వము . श्रुतय ऊचुः- “न तस्य कार्यं कारणं च विद्यते” , “यः सर्वज्ञः सः सर्ववित् " आदि।
ముఖమే అద్దం ఉండుట వల్ల ప్రతిబింబముఖంగా కనబడుతున్నది- నిజానికిప్రతిబింబముఖం అంటూ లేదు.
అదేవిధంగా బ్రహ్మయే మాయవలన జీవభావంతో చరిస్తున్నాడు - జీవుడు లేడు. విద్యతో ముక్తిని పొందుతున్నాడు.ఈ కారణం చేతనే తెరకు అటువైపు ఉన్న ఈశ్వరుడు సర్వజ్ఞుడు,अहं वेद , मां तु वेद न कश्चनఅంటున్నాడు,
(तु - ‘తు’ శబ్దం జ్ఞానప్రతిబంధద్యోతనార్థము. )
మనం ‘తెఱ తీయగ రాదా’ అని ప్రార్థించవలసిన స్థితిలో ఉన్నాము, ఇతిభావః…mvr
27
_____________________________________
इच्छाद्वेषसमुत्थेन द्वन्द्वमोहेन भारत,
सर्वभूतानि संमोहं सर्गे यान्ति परन्तप।
___________________________
नन्दिनी
भगवदज्ञानस्य दार्ढ्ये हेतुः-
इच्छा-अनुकूलविषये रागः
द्वेषः-प्रतिकूलविषये अप्रीतिः
ताभ्यां
समुत्थितेन-सम्यक्-उत्पन्नेन
द्वन्द्वमोहेन-सुखदुःखादिरूप-द्वन्द्वनिमित्तेनमोहेन
सर्वभूतानि-प्राणिनः
सर्गे-स्थूलदेह-उत्पत्तौ सत्यां
संमोहं-
मोहः-विचित्तता
संमोहः-सम्यक् मोहः, ततः
विवेक-अयोग्यता
यान्ति-प्राप्नुवन्ति।( नश्वरे देहे आत्माभिमानं प्राप्नुवन्ति;नतु आत्मानं जानन्ति।)
संबोधनद्वयं
1) भारत !- इतिउत्तमवंशे संभवत्वात् सहज उत्कृष्टता
2) परन्तप !! - इति शत्रुतापनत्वेन शक्तिमत्वात् च उत्कृष्टता
Why are the beings taking birth again and again? Why are they failing to cognise Me?
The answer is -
In brief,
All the beings in creation get confounded due to the delusion of ‘dualities’ .
Attachment and aversion give birth to these dualities.
Attachment and aversion are mutually opposed like cold and warmth directed at pleasure and pain.
…………
अध्यास / अविद्या
Brahma Sutra Bhashya of Shankaracharya( 7th century BC 1.1.1)पश्वादिभिश्चाविशेषात् …
states that " there is no difference of the learned from the animals ( inregard to empirical behaviour ). Just as animals turn away from noise etc when these appear to be unfavourable eg running away when they notice a man approaching them with a raised stick, thinking “this man wants to hurt me” ,
/ the animals move towards objects when they are favourable eg the animals approach another carrying green grass, similarly-
even the wise people are repelled by the presence of strong,uproaring persons with evil looks and upraised swords and are attracted by men of opposite nature.
We believethat this is told by Sigmund Freud ( 1856 to 1939) as Pleasure and Pain principle.
Hence we are in Adhyasa अध्यास / अविद्या .
…………
These dualities subjugate the intelligence of all beings and give rise to the delusion that impedes the dawn of knowledge of the Self.
The knowledge of inner Self is difficult to gain,need less to say ( कैमुतिक न्याय )when one’s intelligence is in the grip of of delusion.
People fail to know Me,the Atma,because they are subject to this delusion.
ప్రాణులు నిన్ను తెలుసుకోకుండా ఏవి అడ్డుపడుతున్నాయి అనే ప్రశ్నకు సమాధానంగాఇలా చెపుతున్నాడు-
_ఇచ్ఛాద్వేష సముత్థేన ద్వన్ద్వమోహేన భారత ! ,
సర్వభూతాని సంమోహం సర్గే యాన్తి పరన్తప !__
నన్దిని
సర్వప్రాణులూ సృష్టిసమయంలో
ఇచ్ఛ,ద్వేషం అనే ద్వన్ద్వంవల్ల కలిగే మోహంచేత వివేకం కోల్పోయి ఉంటాయి.
a) భారత !- ఉత్తమ వంశోద్భవుడవు కనుక ( nature , genes )
b) పరన్తప !! - అనాత్మ వస్తువులను పీడించేందుకు ఉత్కృష్ట శక్తిని కూడా సాధించిన ( nurture , cultivation on your own)
సర్గే- సృష్టి సమయంలో
సర్వభూతాని- అన్ని భూతాలూ
ఇచ్ఛాద్వేష సముత్థేన- అనుకూల,ప్రతికూల విషయాలవల్ల కలిగే
ద్వన్ద్వమోహేన- ద్వన్ద్వాలపైమోహం చేత
సంమోహం యాన్తి- అధిక మోహాన్ని పొందుతాయి.
ఇదివరలో, యోగమాయను
భగవత్తత్త్వ విజ్ఞానానికి ప్రధానమైనఅడ్డంకిగా పేర్కొన్న భగవన్తుడు,హేత్వన్తరాన్ని కూడా చెపుతున్నాడు-
ఇచ్ఛాద్వేష సముత్థేన -
ఇచ్ఛా- అనుకూలమైన వాటియందు ప్రీతి,
ద్వేషః - అననుకూలమైన వాటి యెడ అప్రీతి
సముత్థేన- సముత్పన్నమైన ,బాగా ఉత్పత్తిఅయిన
………..
ద్వన్ద్వం- పరస్పర విరుద్ధాలైన సుఖదుఃఖాలు ( उभयपदप्रधानः द्वन्द्वः)
మోహః- వివేకం కోల్పోవుట
సర్వభూతాని- సర్వ ప్రాణులూ కూడా
………….
సర్గే- ఉత్పత్తి కాలంలోనే
సంమోహం- మూఢభావమును
ప్రాచీన కర్మదోషంతో
యాన్తి- పొందుతారు.
జన్మాన్తరీయ పాపాలవల్ల వేదాన్తం పై మనసు కుదురుగా నిలువదు,నిలిచినా జ్ఞానం పుట్టదు. ज्ञानं नोत्पद्यते पुंसां पापोपहतचेतसाम् అనే స్మృతివాక్యంవల్ల కామ్యకర్మలలో రుచి పుట్టినట్లువేదాన్తజ్ఞానంలో మక్కువ కలుగదు,కలిగినా శ్రవణాదులలో ప్రవృత్తి ఉండదు,ప్రవృత్తి ఏర్పడ్డా స్థూలవిషయం తెలిస్తే అదే గొప్ప,సూక్ష్మ వివేచన చేయలేరు- దీనికి కారణం ప్రాగ్భవీయ పాపకార్యాలు అనుకోవలసి ఉంటుంది.
అన్తర్యామి జీవులకు హితుడు,స్నేహితుడు కూడా. అయినా తనకు ఉపకారిని గుర్తించే స్వభావం జీవునికి లేదు, గుర్తించక పోవుటకు కారణము మోహము. మోహానికి కారణం రాగద్వేషాలు. రాగద్వేషాలు ఉంటే బాహ్యవస్తుజ్ఞానమే సరిగ్గా కలుగదంటే- ఆన్తరమైన ప్రత్యగాత్మ గురించి చెప్పేదేమున్నది?
పణ్డితుడు పశువు కన్నా భిన్నుడేమీకాడని ఆదిశఙ్కరులు ( 7 వ శతాబ్దం క్రీస్తు పూర్వం) తమ శారీరక భాష్యం 1.1.1 లో చెప్పిన విషయాన్ని ఫ్రాయిడ్( 1856 - 1939) ప్లెజర్ అండ్ పెయిన్ ప్రిన్సిపుల్ గా గ్రంథచౌర్యమే చేసినా, పాశ్చాత్యాసంస్కృతికే అంకితమైన,
సంస్కృతికిగల మూలాలనే విస్మరించిన జాతికి - వివేకప్రదానం చేయగల జ్ఞానులు అసంఖ్యాకంగా పుట్టుదురు గాక అని ఈశ్వరుని ప్రార్థించెదము గాక,
ఇష్టప్రాప్త్యనిష్టపరిహారాలకోసం ప్రయత్నిస్తున్నా కూడా-
ఆత్మను ఈశ్వరునిగా తెలుసుకోలేకపోవుటయే గాక,
ఆత్మ కర్త అనీ,ఆత్మ భోక్త అనీ భావిస్తున్నారు. దీనికి కారణం దేహేన్ద్రియ అభిమానము.
అన్తతోగత్వా,
భగవత్ జ్ఞానానికి యోగమాయ ముఖ్య ప్రతిబంధకం,
రాగద్వేషాలు అన్ని పురుషార్థాలకూ ప్రతిబన్ధకాలే కనుక సాధకులు వాటికి లోబడకుండుట ఉత్తమ మార్గము , ఇతిభావః….mvr
28
येषांत्वन्तगतं पापं जनानां पुण्यकर्मणाम् ,
ते द्वन्द्वमोहनिर्मुक्ता भजन्ते मां दृढव्रताः ।
____________________________
नन्दिनी
सर्वभूतानि संमोहं यान्ति चेत्, लुप्तः मुक्तिमार्गः इत्यतः केचित् सन्ति द्वन्द्वमोहरहिताः इति आह-
येषां तु- केचित् विलक्षणानां जनानाम्
पुण्यकर्मणां-नैक जन्मसु पुण्याचरणशीलानाम्
पापंअन्तगतं-पापं अवसानं प्राप्तं = नष्टम् ( कथं? पुण्यैः कर्मभिः ज्ञानप्रतिबन्धकं पापं विनष्टम् - “धर्मेण पापमपनुदति” इति श्रवणात्)
ते- निष्पापाः सन्तः
द्वन्द्वमोहनिर्मुक्ताः-
द्वन्द्वमोहेन=विपर्ययज्ञानेन
निर्मुक्ताः-निःशेषेण मुक्ताः
दृढव्रताः- अचाल्यसङ्कल्पाः
मां-प्रत्यगभिन्नं ,परमात्मानम्
भजन्ते-सर्वात्मनासेवन्ते ।
Then , who are the delusion-free people , knowing You according to shaastras,worship You as their Self ?
Bhagavan sets forth as follows,
In brief,
Those worship Me with steadfast will -
who don’t have any more sin, who act righteously and who are liberated from dualities.
They worship Me , the Supreme Self, whose sins have almost been wiped out ,समाप्तप्रायं पापं , whose acts are righteousand productive of psychological purification,पुण्यकर्मणां सत्त्वशुद्धिकारणं , and get liberated from the delusive dualities , द्वन्द्वमोहनिर्मुक्ताः .
Their worship is with a steadfast will,दृढव्रताः .
మఱి, ద్వన్ద్వాల మోహంలోనుండి బయటపడి,శాస్త్రం చెప్పినవిధంగా ఆత్మభావంతో భజించేదిఎవరు ?
భగవన్తుడు ఆ విషయాన్ని చెపుతున్నాడు,
యేషాంత్వన్తగతం పాపం జనానాం పుణ్యకర్మణామ్,
తే ద్వన్ద్వమోహనిర్ముక్తా భజన్తే మాం దృఢవ్రతాః.
నన్దిని
పాపాలు చాలామట్టుకు క్షీణించిన పుణ్యాత్ములు మాత్రము ( ఇది అపవాదమేను, ఇట్టివారు అరుదుగానే ఉంటారు )ఇచ్ఛాద్వేషాలనే ద్వన్ద్వాలు కలుగ జేసిన మోహంలోనుండి బయటపడి,దృఢ నిశ్చయంతోఆత్మను భజిస్తారు.
‘సర్వభూతాని’ అని 27వ శ్లోకంలో చెప్పిన విధంగామోహం అన్ని ప్రాణులనూ కప్పివేస్తున్నదే,అదీ జన్మసమయంలోనే -మరి ‘చతుర్విధా భజన్తే మామ్’ అని చెప్పినావే,యీ నాలుగు విధాలుగా భజించేందుకు మిగిలింది ఎవరు అంటే -
పూర్వజన్మలలోని పుణ్యఅతిశయం చేతజ్ఞానప్రతిబంధకాలైన పాపాలు నష్టప్రాయమగుట వల్ల (धर्मेण पापमनुदति అని శ్రుతి చెప్పింది కదా, కనుక ) రాగద్వేషాదులు వాటంతట అవే విడిచిపెట్టి పోవుటవల్ల పునరావృత్తి లేకపోవుటవల్లా,
దృఢ వ్రతాః - అచలమైన సంకల్పం కలవారు ,
‘నాతోసహఈజగత్తు అంతా బ్రహ్మమే’ అనే నిశ్చయబుద్ధి కలవారు ,
ఆత్మతత్త్వం ఇదే - మరొకటి కాదు అనే నిశ్చితవిజ్ఞానం కలవారు,
_मां भजन्ते_నన్ను,పరమాత్మగా ,సేవిస్తారు .
సారం- ఈజన్మలోని లేదా జన్మాన్తరంలోని నిష్కామకర్మాచరణంతో చిత్తశుద్ధి కలిగి,చిత్తశుద్ధితో మోహం తొలగిపోయి,
మోహనిర్మూలనంతో ఆత్మానాత్మజ్ఞానం కలిగి,
… క్రమంగాఆత్మసాక్షాత్కారాన్ని - క్రమ ముక్తిని-పొందుతారు,ఇతిభావః…mvr
29
( भगवद्भजनफलनिरूपणम् )
ते किमर्थं भजन्ते उच्यते-
जरामरणमोक्षाय मामाश्रित्य यतन्ति ये,
ते ब्रह्म तद्विदुः कृत्स्नमध्यात्मं कर्मचाखिलम् ।
____________________________
नन्दिनी
अष्टमाध्यायस्य सूत्रभूतौ द्वौ श्लोकौ उच्येते ,
सुकृताचरणे अपि भगवदाश्रयव्यतिरेकेण तत्त्वावबोधः न भवति- इत्याह
जरामरणयोः मोक्षाय-संसारनिवृत्तये
मां -इष्टफलदातारम्
आश्रित्य- शरणं गत्वा
ये यतन्ति- ये प्रयत्नं कुर्वन्ति( मत् प्रीणनार्थं कर्माणि कुर्वन्ति)
ते -शुद्धान्तःकरणाः सन्तः
तत्-तत्पदलक्ष्यम्
ब्रह्म विदुः-मां परं ब्रह्म विदुः ।
तथा
आत्मानं-शरीरमधिकृत्य प्रकाशमानम्
कृत्स्नं- सर्वम् , सरहस्यं समस्तं कर्म
विदुः -ब्रह्मैव विदुः
अत्र मन्दप्रज्ञानां सर्वत्र ब्रह्मबुद्धिकरणं, सगुणोपासनं,उपदिशति ।
Those who strive for release from old age,death etc. come to My resort with concentrated mind and come to know that Brahma in Its wholeness,the reality of the inner Self and work in its entirety.
వారు ఎందుకు భజిస్తారు?
సమాధానం -
____________________________
జరామరణమోక్షాయ మామాశ్రిత్య యతన్తి యే,
తే బ్రహ్మ తద్విదుః కృత్స్నమధ్యాత్మం కర్మచాఖిలమ్.
నన్దిని
నన్ను ఆశ్రయించి’ముసలితనం,మరణం నుండి’విముక్తికై యత్నించే వారు-
బ్రహ్మనూ,సమస్త అధ్యాత్మాన్నీ,కర్మనూ తెలుసుకుంటారు.
యే - ఎవరు
మామ్- నన్ను
ఆశ్రిత్య- ఆశ్రయించి
………….
జరామరణమోక్షాయ - ముసలితనం,చావు ల నుండి ముక్తికై - అనాత్మ తాదాత్మ్య అధ్యాస నివృత్తికై ( శరీరాన్ని ఆత్మగా భావించుట నివర్తించుటకై)
యతన్తి - యత్నిస్తారో
తే- వారు
…………..
బ్రహ్మ- గొప్పనైన బ్రహ్మపదార్థాన్నీ
కృత్స్నం అధ్యాత్మమ్- ఆత్మజ్ఞానం మొత్తాన్నీ
అఖిలం కర్మ చ - యజ్ఞం మొదలైన అన్ని కర్మలనూ,(సర్వమూ బ్రహ్మ కార్యమేకద)
………..
విదుః - తెలుసుకుంటారు.
జరామరణాలు - ముసలితనం,మృత్యువు- ఇవి రెండూ షడ్భావవికారాలకు ఉపలక్షణం , synecdoche.
భావ వికారాలు भावविकाराः
-
జాయతే , పుట్టును
-
వర్ధతే , పెరుగును
-
విపరిణమతే , మార్పుపొందును
-
అపక్షీయతే,చిక్కిపోవును
5.నశ్యతి,కనబడకుండా పోవును( మరణించును )
6.అస్తి- ఐనా, ఉంటుంది.
భావవికారాలను పోగొట్టుకునేందుకు పరమేశ్వరుడైన ప్రత్యగాత్మపై మనస్సును ఉంచి ఆత్మను పరమేశ్వరరూపంగా భజించేవారు-
-
తత్ పద లక్ష్యమైన ‘బ్రహ్మ’ నూ
-
త్వం పద లక్ష్యమైన ఆత్మతత్త్వాన్నీ ( కృత్స్నం ‘అధ్యాత్మం’ )
-
యజ్ఞాదులు (త్యాగం)లక్షణమైన ‘కృత్స్నకర్మ’ నూ తెలుసుకుంటారు.
‘एकविज्ञानेन सर्वविज्ञान’ శ్రుతి ప్రకారం,బ్రహ్మ పదార్థం తెలిస్తే సర్వమూ తెలుస్తుంది కనుక,ఆత్మ బ్రహ్మమునకు భిన్నంగా లేదు కనుక-
ఆత్మజ్ఞానంతో బ్రహ్మజ్ఞానం మరియు సర్వజగత్తుకూ ఆధారమైన త్యాగపూర్వక కర్మజ్ఞానమూ లభిస్తాయి. భక్తులు అభిలషించినట్టి పురుషార్థం- జరా మరణాలనుండి ముక్తి - కూడా లభిస్తుంది.
………….
మరణం నుండి విముక్తి ఎలా సాధ్యము?
ఆత్యన్తిక మృత్యువు త్రిమూర్తులకు కూడా తప్పదు- అయితే అనాదిగా వస్తున్న అవిద్యవల్ల,ఆత్మ జ్ఞానం లోపించుట వల్ల,దేహమే ఆత్మ అనే ‘అధ్యాస’ నివర్తింపబడుతుంది,
………..
యీ అధ్యాస నిరాసం కొరకై సద్భక్తుడు భగవన్తుణ్ణి ఆశ్రయించవలెనని ఆకాంక్ష.ఆత్మ నిత్యముక్తము,ఆత్మ - స్వతః షడ్భావవికార రహితము అయియే వున్నది.కొత్తగా మరణరాహిత్యం అవసరమే లేదు.
ब्रह्मविद्ब्रह्मैव भवति అనే వాక్యం ప్రకారం బ్రహ్మవేత్త బ్రహ్మమైయే వున్నాడు ( భవతి శబ్దం వర్తమాన కాల సూచి).
“అశ్వత్థామా బలిర్వ్యాసో హనూమాంశ్చ విభీషణః కృపః పరశురామశ్చ సప్తైతే చిరజీవినః”
అనుటలో యీ యేడుగురూ సాధారణ మనుష్యాదులతో పోల్చగా,సాపేక్షంగా చిరంజీవులు అనుటయే అన్తరార్థము,ఇతిభావః…mvr
30
( भक्तियोगस्य गरीयस्त्वनिरूपणम् )
साधिभूताधिदैवं मां साधियज्ञं च ये विदुः ,
प्रयाणकालेपिच मां ते विदुर्युक्तचेतसः
____________________________
नन्दिनी
भक्तानां मृत्युकाले अपि मत् विस्मरणं न शङ्कनीयम्
1 अधिभूतं-कार्यं सर्वम् ,
2 अधिदैवं-हिरण्यगर्भः, अग्निः,
ताभ्यां सह वर्तत इतिसाधिदैवम्
3 अधियज्ञं-यज्ञाधिदेवता ।
तेन सहवर्तत इति साधियज्ञम्
तेन सहितं
मां-परं ब्रह्म
युक्तचेतसः- तत् स्मरणवन्तः सन्तः
ये विदुः-स्वप्राप्यफलानुगुणं ये विदुः ( ये पश्यन्ति) , न तु मत्तो भिन्नं न श्रुण्वन्ति/
न पश्यन्ति/ न स्मरन्तिअन्यः ।
तदत्र शुद्धबुद्धीनां ज्ञेयं ब्रह्म निरूपितं,
मध्याधिकारिणां ध्येयं बोधाय हरिणेरितम्।
Iexist amidst elements and amidst divinities and sacrifices. Those who know that I exist in such manifestations can knowMe with concentrated minds ,at the time of departure ie death.
సాధిభూతాధిదైవం మాం సాధియజ్ఞం చ యే విదుః ,
ప్రయాణకాలేపి చ మాం తే విదుర్యుక్తచేతసః .
నన్దిని
_अधिभूत_ప్రాణుల సముదాయాన్ని అధిష్ఠించి ఉన్న నన్ను,
_अधिदैव_ఇన్ద్రియాలను అధిష్ఠించి ఉన్న తత్త్వమైన నన్ను ,
अधियज्ञ యజ్ఞాన్ని ( త్యాగాన్ని) అధిష్ఠించిన తత్త్వం గా ఉన్న నన్ను ,
తెలుసుకున్నవారు -మరణసమయంలో కూడా ఏకాగ్రచిత్తంతో నన్ను సాక్షాత్కరించుకుంటారు.
ఇటువంటి నాభక్తులు - శరీరాన్ని విడిచిపెట్టేసమయంలో దేహేన్ద్రియాల బాధలు మిక్కుటంగా ఉన్నందువల్ల నన్ను విస్మరిస్తారనే శంక అక్కరలేదు.
నన్ను భూతాలన్నిటిలోనూ,అన్ని దేవతలలోనూ/ అన్ని ఇన్ద్రియాలలోనూ,అన్ని త్యాగపూర్వక మహద్విషయాలలోనూ చూచే -సదా సమాహితమనస్సు గలవారు
ఆ సంస్కారబలంతో ప్రాణోత్క్రమణకాలంలో, च’చ’ కారం వల్ల అప్రయత్నంగానే , సర్వాత్మకుడనైన నన్ను తలుచుకుంటారు.ఆవిధంగా నా భక్తియోగంతో కృతార్థులవుతారు.
భక్తులకు ప్రత్యక్షంగానో , పరోక్షంగానో పరమాత్మస్ఫురణ కలిగించే విషయజాతం ప్రపంచంలో సమృద్ధిగా వున్నది- అందుకే, భాగవతంగజేన్ద్ర మోక్షంలో ( 8. 04. 17 నుండి 23 వరకూ) ఫలశ్రుతిని చెప్పుతూ భగవన్తుడు-
" తెల్లవారుఝామున లేచి నన్నో,నిన్నో,యీ సరస్సునో,పర్వతాలనో,గిరికన్దరాలనో,అడవినో,ఇక్కడ వర్ణించిన చెట్లూ మొక్కలనో,బ్రహ్మనో,శివుణ్ణో , పాలపుంతనో,శ్వేతద్వీపాన్నో,భగవదలంకారాలనో,ఆయుధాలనో,వేదాన్నో,నారదాది ఋషులనో,ఏదో ఒక అవతారాన్నో,ప్రహ్లాదాది భక్తులనో,చన్ద్ర సూర్య అగ్నులనో,ఓంకారాన్నో,గోవునో,వేదపండితులనో…గంగాది పుణ్యనదులనో,మంచి మనుష్యులనో తలుచుకుంటే చాలు - నేను,ప్రాణాత్యయంలో విమలమతిని ప్రసాదిస్తా” నన్నాడు -పరంపరయా భగవత్ స్ఫురణ జరుగుతుంది గనుక.
మరణసమయం గుఱించి ఎందుకు చెప్పుట? అంటే,यान्ते मतिः सा गतिः , మృత్యుకాలంలో మనస్సు దేనిపై నిలిచిఉంటుందో ఆజన్మయే తదుపరి పుట్టుక కనుక.
భరతచక్రవర్తి వానప్రస్థాశ్రమంలో ఉండికూడా మరణకాలంలో లేడిపిల్లను తలుచుకొని లేడిగానే ఇంకో జన్మను ఎత్తుట భాగవతం 5. 8. 27… इतरवन्मृगशरीरमवाप లో చెప్పబడినది కనుక.
భక్తులకు యోగభ్రంశత్వశంక అక్కరలేదని పిణ్డితార్థము.
ఈవిధంగా ఏడవ అధ్యాయం ఉత్తమాధికారి యొక్క జ్ఞేయాన్నిగురించి వివరించుట - మొదటఆ జ్ఞానం పొందేందుకైమధ్యమాధికారి కోసంతత్ పదవాచ్యాన్ని ప్రతిపాదించుట- తత్ పదవాచ్యాన్నీ , దాని లక్ష్యాన్నీ వివరించుట జరిగింది, ఇతిభావః …mvr
इति श्रीमद्भगवद्गीताभाष्ये विज्ञानयोगो नाम सप्तमोध्यायः .
____________________________________
हरये नमः
___________________________________